కొత్త పారిశ్రామికవాడలకు లైన్‌ క్లియర్‌

ABN , First Publish Date - 2021-12-05T05:30:00+05:30 IST

పరిశ్రమల స్థాపనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్రప్రభుత్వం.. రాష్ట్రంలో మరిన్ని పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో వీటి ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎ్‌సఐఐసీ) ప్రభుత్వ స్థలాలను గుర్తిస్తోంది. అవసరమైతే ప్రైవేటు స్థలాలనూ సేకరిస్తారు. పరిశ్రమల స్థాపనకు ఒక్కో పారిశ్రామికవాడలో కనిష్ఠంగా 100 గరిష్టంగా 500 ఎకరాలను సేకరిస్తారు.

కొత్త పారిశ్రామికవాడలకు లైన్‌ క్లియర్‌

మహబూబాబాద్‌, ములుగు, భూపాలపల్లిలో ఏర్పాటు
ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహం
మెగా పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటు
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం
స్థలసేకరణలో అధికారులు
హనుమకొండ, జనగామలో ఎంఎ్‌సఈ పార్కులు


పరిశ్రమల స్థాపనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్రప్రభుత్వం.. రాష్ట్రంలో మరిన్ని పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో వీటి ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎ్‌సఐఐసీ) ప్రభుత్వ స్థలాలను గుర్తిస్తోంది. అవసరమైతే ప్రైవేటు స్థలాలనూ సేకరిస్తారు. పరిశ్రమల స్థాపనకు ఒక్కో పారిశ్రామికవాడలో కనిష్ఠంగా 100 గరిష్టంగా 500 ఎకరాలను సేకరిస్తారు.

హనుమకొండ, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి):
ప్రస్తుతం రాష్ట్రంలో వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, సైబరాబాద్‌, శంషాబాద్‌, పఠాన్‌చెరువు, మేడ్చల్‌-సిద్ధిపేట, యాదాద్రి, ఖమ్మంలను జోన్లుగా విభజించి పారిశ్రామికవాడలను ఏర్పా టు చేశారు. తొమ్మిది పారిశ్రామిక జోన్ల పరిధిలో ప్రస్తుతం 29 జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరిగిన నేపథ్యంలో ఆహారశుద్ధి, అనుబంధ పరిశ్రమలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. అన్ని జిల్లాల్లో స్థానిక పంటలవారీగా పరిశ్రమల స్థాపనకు పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తోంది. ఇందుకు సంబంధించి గతంలో దరఖాస్తులను ఆహ్వానించగా 33 జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారు. అయితే రాష్ట్రంలో మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లితో సహా ఏడు జిల్లాల్లో పారిశ్రామిక వాడలు లేవు. పరిశ్రమల స్థాపనకు స్థలం అందుబాటులో లేకపోవడంతో ఈ జిల్లాలో పరిశ్రమల స్థాపనలో జాప్యం జరుగుతోంది. దీంతో ఈ జిల్లాల్లోనూ స్థలం సేకరించి పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా అధికారులు కసరత్తు మొదలు పెట్టారు.

ఆహారశుద్ధి పరిశ్రమలు

ఈ మూడు జిల్లాల్లో త్వరలో ఏర్పాటు చేయబోయే పారిశ్రామిక వాడల్లో సాంప్రదాయిక పరిశ్రమల స్థాపనకన్నా ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ జిల్లాల్లో గిరిజనులు, దళితులు ఎక్కువగా ఉండడంతో వారు పండించే పంటలతో పాటు, స్థానికంగా లభ్యమయ్యే ఆహార ఉత్పత్తులను దృష్టిలో పెట్టుకొని పరిశ్రమల స్థాపన జరిగేలా చూస్తారు. ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహిస్తారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ ద్వారా ఆహార శుద్ధి రంగంలో చిన్న యూనిట్లతో పాటు గ్రామీణ ప్రాంత యు వతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

గిరిజనులకు చేయూత
తెలంగాణ బ్రాండ్‌ పేరిట నాణ్యమైన ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అయ్యేలా చూడడమే లక్ష్యంగా ఈ కొత్త పారిశ్రామి క వాడల ఏర్పాటు జరుగుతోంది. ఈ జిల్లాల్లో చిన్న తరహా ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రొత్సహించడంతో పాటు స్థానిక గిరిజన, దళిత, మహిళా పారిశ్రామికవేత్తలు పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు అవకాశాలు లభించే లా చూస్తారు. ఇప్పటికే ఈ జిల్లాలో స్థానికంగా లభ్యమయ్యే ఖనిజాలు, ముడి పదార్థాలు, వ్యవసా య, అటవీ ఉత్పత్తులను గుర్తించారు. ప్రధానంగా ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించడానికి అందుకు అవసరమైన వ్యవసా య ఉత్పత్తుల సాగుకు మ్యాపింగ్‌ కూడా చేశారు.

మెగా ప్లాంట్లు
ఈ పారిశ్రామిక వాడల్లో ఆహారశుద్ధి ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే  రైతు సంఘాలు, మహిళా సంఘాలతో పాటు ఎస్సీ, ఎస్టీ వర్గాలకూ పలు ప్రోత్సాహకాలు కల్పిస్తారు. వీటితోపాటు రూ.100కోట్లతో ఏర్పాటు చేసే ప్లాంటును మెగా యూనిట్‌గా గుర్తించి అందుకు అవసరమైన రాయితీలు ఇస్తారు. ఆహార శుద్ధి ప్లాంట్లకు సంబంధించి రూపొందించిన కొత్త పాలసీ ప్రకారం ఈ పారిశ్రామికవాడల్లో పరిశ్రమల స్థాపనకు టీఎ్‌సఎ్‌సఐసీ చర్యలు తీసుకుంటుం ది. దీనితో పాటు భవిష్యత్తులో పెరిగే ఆయా ఉత్పత్తుల డిమాండ్‌ను బట్టి వీటిలో రాష్ట్ర స్థాయి ఇంటిగ్రేటెడ్‌ యూనిట్ల స్థాపన కూడా చేపడతారు.

అందుబాటులో భూమి
మహబూబాబాద్‌ ములుగు, జయశంకర్‌ జిల్లాల్లో పారిశ్రామికవాడల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్నట్టు టీఎ్‌సఐఐసీ జరిపిన సర్వేలో తేలింది. పారిశ్రామికవాడల ఏర్పాటుకు ఒక్కోదాని కోసం గరిష్టంగా 500 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. వరంగ ల్‌, హనుమకొండ, జనగామ జిల్లాల్లో మాదిరిగా ఈ మూడు జిల్లాల్లో భూ సేకరణ సమస్య అంతగా ఉం డకపోవచ్చు. ప్రభుత్వభూమితో పాటు ప్రైవేటు భూ ములు కూడా చాలినంత మేరకు అందుబాటులో ఉన్నాయి. దేవాదులతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టువల్ల పరిశ్రమలకు అవసరమైన నీరు కూడా పుష్కలంగా లభ్యమవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీ రు లభ్యత పెరిగిన తర్వాత ఈ జిల్లాల్లో సాగు విస్తీ ర్ణం కూడా పెరిగింది. పారిశ్రామికవాడల్లో ఆహారశుద్ధి పరిశ్రమల స్థాపనకు ఇది ఎంతో దోహదకారి కానున్నది.

ఎంఎ్‌సఈ పార్కులు
ఈ మూడు జిల్లాలతో పాటు హనుమకొండ, జనగామ జిల్లాలో రెండు చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వాడలు (ఎంఎ్‌సఈ పార్కులు) ఏర్పాటవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది చిన్న, మధ్య తరహా పారిశ్రామికవాడలను ప్రభుత్వం ఏర్పాటులో భాగంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో ఈ పార్క్‌లు మంజూరయ్యాయి. వీటి ఏర్పాటుకు కనిష్టంగా 200 ఎకరాలు, గరిష్టంగా 500 ఎకరాలు సేకరిస్తారు. భీమదేవరపల్లిలో 114 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. మరో 150 ఎకరాల ప్రైవేటు భూమి సేకరణకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దేవరుప్పుల మండలంలో 145 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మరో 160 ఎకరాల ప్రైవేటు భూమి  సేకరణకు కసరత్తు జరుగుతోంది. ఈ మండలాల్లో భూసేకరణ సమస్యగా మారింది. అనువైన భూమి అందుబాటులో లేదు. పరిశ్రమ స్థాపనకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడం లేదు.

15 యూనిట్ల స్థాపన
ప్రధానంగా హనుమకొండ జిల్లాలో ఈ సంవత్సరం పారిశ్రామిక, సేవా రంగాల్లో రూ.101.72లక్షల పెట్టుబడితో 15 యూనిట్ల స్థాపన జరిగింది. ఇందు కోసం యూనిట్‌దారులకు రూ.39.33లక్షలను రాయితీగా ఇచ్చారు. ఈ యూనిట్లలో 30మందికి ఉపాధి లభించింది. ఈ ఏడు ఏప్రిల్‌ ఆగస్టు నెలల మధ్య కాలంలో 22 పరిశ్రమలకు 97 అనుమతుల కోసం దరఖాస్తు  చేయగా 42 అనుమతులు వివిధ శాఖల ద్వారా లభించాయి. ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రామ్‌ కింద 2020-21 సంవత్సరానికిగాను 28 యూనిట్లు ఏర్పాటు చేయాలన్నది లక్ష్యంకాగా 8 మంజూరు అయ్యాయి. యూనిట్ల స్థాపనకు 54 దరఖాస్తులు అందాయి. ఆన్‌లైన్‌ద్వారా వీటిని బ్యాంకులకు పంపించారు. ఒక యూనిట్‌కు రుణం విడుదలైంది.

Updated Date - 2021-12-05T05:30:00+05:30 IST