వంగలిలో ఐఐపీఈ నిర్మాణానికి లైన్‌ క్లియర్‌

ABN , First Publish Date - 2022-08-07T06:36:01+05:30 IST

ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ వర్సి టీని మండలంలోని వంగలిలో నిర్మించేం దుకు ఎట్టకేలకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

వంగలిలో ఐఐపీఈ నిర్మాణానికి లైన్‌ క్లియర్‌
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి


 హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ 

సబ్బవరం, ఆగస్టు 6 : ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ  వర్సి టీని మండలంలోని వంగలిలో నిర్మించేం దుకు ఎట్టకేలకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.  ఐఐపీయూఈ ప్రాజెక్టు భూములు సాగుచేసుకుంటున్న వారు, ఆ భూములపై ఆధారపడి జీవిస్తున్న వ్యవ సాయ కూలీలు 29 మంది 20.88 ఎకరాలకు సంబంధించి గతంలో  హైకోర్టును ఆశ్రయిం చారు. అయితే ఎకరాకు రూ. 13లక్షలు చొప్పున పరిహారం సొమ్మును కోర్టులో జమచేయాలని, పునరావాసం, పునర్నిర్మాణ ప్యాకేజీ కింద ప్రతి పిటిషనర్‌కు రూ. 5.5 లక్షలు రెండు వారాల్లో జమచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. డి.పట్టా రైతులు ఎనిమిది మంది రూ.2.12 కోట్లు, ఆక్రమణదారులు 15 మంది రూ.86.66 లక్షలు ప్రభుత్వం జమ చేసే సొమ్ము నుంచి తీసుకోవచ్చని పేర్కొంది. 

రాష్ట్ర విభజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి జాతీయ స్థాయి విద్యా సంస్థ ఐఐపీయూఈని మంజూరు చేసింది. సదరు జాతీయ విద్యా సంస్థను వంగలిలో ఏర్పాటు చేసేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం వంగలి రెవెన్యూ పరిధిలో 201.72 ఎకరాల భూమిని కేటాయించింది. ఐఐపీఈ నిర్మాణాకి అప్పటి కేంద్ర కేబినెట్‌ రూ.655.46 కోట్లు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. ఈ మేరకు 2016 అక్టోబరు 20న అప్పటి ముఖ్యమంత్రి  చంద్ర బాబునాయుడు, అప్పటి కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, వెంకయ్య నాయుడు  శంకుస్థాపన చేశారు. 2018లో సుమారు 150 మంది రైతులకు ప్రభుత్వం సుమారు రూ.15 కోట్లు పరిహారం చెల్లించింది. 2016-17 విద్యా సంవత్సరం నుంచి ఐఐపీఈ తాత్కాలికంగా ఆంధ్రా యూనివర్సిటీలో తరగ తులను ప్రారంభించింది. అయితే ఇరవై ఎకరా లకు సంబంధించి 29 మంది రైతులు పరి హారం చాలదంటూ సీపీఎం ఆధ్వర్యంలో హైకో ర్టును ఆశ్రయించారు. ఏపీఐఐసీ చేపట్టిన ఐఐపీయూఈ ప్రహరీ   నిర్మాణ పనులను కూడా అప్పట్లో  అడ్డుకున్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో ఎట్టకేలకు శుక్రవారం ఐఐపీయూఈ నిర్మాణానికి అడ్డంకులు తొలగాయి. 

ఐఐపీఈ ఏపీకే తలమానికం : బండారు

సబ్బవరం: ఇండియన్‌ ఇనిస్టి ట్యూట్‌ ఆఫ్‌ పెట్రో అండ్‌ ఎనర్జీ వర్సిటీ ఆంధ్రప్రదేశ్‌కే తలమానికం అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. ఈ వర్సిటీ నిర్మాణానికి అడ్డంకులు తొలగిస్తూ శుక్రవారం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా ఇరువాడలో ఆయన మాట్లాడుతూ ఐఐపీఈపై వాద నలు వినిపించిన జస్టిస్‌ సోమయాజులుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనకాపల్లి కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి, ఉమ్మడి జిల్లా అప్పటి జేసీ వేణుగోపాలరెడ్డి, అప్పటి ఆర్డీవో, ప్రస్తుత సబ్బవరం తహసీల్దార్‌ సత్యనారాయణ వర్సిటీ కోసం ఎంతో కృషి చేశారని అభినందనలు తెలిపారు. 2016లో ప్రారంభమైన రూ.1000 కోట్లు ప్రాజెక్టును సీపీఎం నాయకులు రైతులను మభ్యపెట్టి అడ్డుకున్నారని ఆరోపించారు. వర్సిటీ నిర్మాణానికి సంబం ధించిన టెండర్‌ ప్రక్రియ త్వరగా జరిగేలా అనకాపల్లి ఎంపీ బి.సత్యవతి ఢిల్లీ స్థాయిలో కృషి చేయాలని, ఆమెకు మంత్రులు బూడి ముత్యాలనాయుడు, అమర్‌నాథ్‌, ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో  పార్టీ నాయకులు పీబీవీఎస్‌ ఎన్‌ రాజు, దొడ్డి ప్రకాష్‌, కొటాన అప్పారావు, గండి దేముడు, దుర్గినాయుడు, పల్ల తాతా రావు, కోరాడ శ్రీను, ఆకులు గణేష్‌, బి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-07T06:36:01+05:30 IST