Advertisement
Advertisement
Abn logo
Advertisement

నుదిటిపై రూ.176 కోట్ల విలువైన వజ్రం.. American Rap Singer కు అభిమానులే షాకిచ్చారు..!

ఎన్నారై డెస్క్: ఎవరికైనా ఏదైనా వజ్రం నచ్చితే ఏం చేస్తారు? మహా అయితే ఉంగరం చేయించుకుంటారు. కానీ లిల్ ఉజి వెర్ట్ అనే ర్యాపర్ మాత్రం ఇంకో అడుగు ముందుకేసి.. తన మనసుకు నచ్చిన వజ్రాన్ని నుదుటిపై అతికించుకున్నాడు. దీంతో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే కొన్ని రోజులుగా మాత్రం అతని నుదుటిపై ఆ వజ్రం కనిపించడం లేదు. దీంతో ఆ వజ్రానికి ఏమైందా? అని అభిమానులు ఆలోచనలో పడ్డారు. వారికి ఇప్పుడు లిల్ ఉజి సమాధానం ఇచ్చాడు. గత నెల జే-జీ 40/40క్లబ్ 18వ వార్షికోత్సవం జరిగింది. ఆ కార్యక్రమంలో ఉజి పాల్గొన్నాడు. అక్కడ పాటపాడే సమయంలో స్టేజి కింద ఉన్న అభిమానులపైకి దూకాడట ఉజి. అప్పుడే ఎవరో అతని నుదుటిపై నుంచి ఆ వజ్రాన్ని ఊడపీకేసినట్లు అతను వెల్లడించాడు. అయితే ఆ వజ్రం తనతోనే ఉందని, కాబట్టి తను అంత బాధపడటం లేదని చెప్పాడు.

లిల్ ఉజి అసలు పేరు సైమీరే బైసిల్ వుడ్స్. జనవరిలో ఈ వజ్రం గురించి ట్వీట్లు చేయడం ప్రారంభించడతను. ఈ వజ్రం కోసం తాను 2017 నుంచి డబ్బు చెల్లిస్తూ వచ్చానని గుర్తుచేసుకున్నాడు. ఇంత సహజంగా ఉన్న పింక్ డైమండ్‌ను తానెప్పుడూ చూడలేదని, అందుకే దీన్ని ఎలాగైనా కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించాడు. తన అభిమాన ఆభరణాల డిజైనర్ ఎలియట్ ఎలియాంటె నుంచి దీన్ని కొనుగోలు చేసినట్లు తెలిపాడు. తన దగ్గర ఉన్న అత్యంత విలువైన వస్తువేంటి? అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు ఈ వజ్రాన్నే చూపించాడు ఉజి. ఈ వజ్రం విలువ రూ. 176 కోట్లు పైనే. ‘‘ఇది 10.. కాదు ఆల్మోస్ట్ 11 క్యారెట్ల వజ్రం’’ అని వివరించాడు.

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement