ప్లేస్టోర్, యాప్ స్టోర్ నుంచి యాప్‌ను తొలగించిన ‘లైకీ’

ABN , First Publish Date - 2020-07-03T01:55:32+05:30 IST

భారత ప్రభుత్వ మధ్యంతర నిషేధంపై షార్ట్ వీడియో షేరింగ్ యాప్ లైకీ స్పందించింది. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్

ప్లేస్టోర్, యాప్ స్టోర్ నుంచి యాప్‌ను తొలగించిన ‘లైకీ’

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ మధ్యంతర నిషేధంపై షార్ట్ వీడియో షేరింగ్ యాప్ లైకీ స్పందించింది. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి దీనిని తాత్కాలికంగా తొలగించినట్టు పేర్కొంది. అలాగే, భారత్‌లో యాప్ సేవలను నిలిపివేసింది. ప్రభుత్వ ఆదేశాలను శిరసావహిస్తున్నట్టు పేర్కొన్న లైకీ.. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి యాప్‌ను తొలగించినట్టు తెలిపింది. ఈ విషయంలో తదుపరి స్పష్టత వచ్చే వరకు భారత్‌లో సేవలను నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. ప్రభుత్వ ఆదేశాలతో సేవలను నిలిపివేసేందుకు తమ ఆర్‌ అండ్ డీ బృందం రాత్రీపగలు పనిచేస్తున్నట్టు వివరించింది. యూజర్ల గోప్యతకు తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్న లైకీ.. లీగల్ ఫ్రేమ్ వర్క్ విషయంలో భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్టు పేర్కొంది.  

Updated Date - 2020-07-03T01:55:32+05:30 IST