మనసుకు నచ్చింది

ABN , First Publish Date - 2021-12-25T05:30:00+05:30 IST

బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కి వెళ్లి రాణి స్తున్న కొద్దిమంది తారల్లో ప్రియాంచోప్రా ముందు వరుసలో ఉన్నారు....

మనసుకు నచ్చింది

బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కి వెళ్లి రాణి స్తున్న కొద్దిమంది తారల్లో ప్రియాంచోప్రా ముందు వరుసలో ఉన్నారు. ఆమె కీలకపాత్రలో నటించిన ‘మ్యాట్రిక్స్‌ రెజరెక్షన్స్‌’ హాలీవుడ్‌ చిత్రం ఇటీవలె విడుదలైంది. ఇందులో పది నిమిషాల నిడివి ఉన్న పాత్రను పోషించడంపై ఆమె మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో నాది లీడ్‌ రోల్‌ కాదు, చిన్న పాత్ర అంటున్నారు. కానీ సినిమా అంగీకరించే ముందు నా పాత్ర చిన్నదా, పెద్దదా అనేది నేను ఆలోచించను. కొన్నిసార్లు నిడివి తక్కువ ఉన్నా, నా పాత్రకు అంతగా ప్రాధాన్యం లేకపోయినా మనసుకు నచ్చితే చాలు చేస్తాను. బాలీవుడ్‌ సినిమాల విషయంలోనూ నేను ఇదే పద్ధతిని అనుసరించాను’’ అని చెప్పారు. ప్రస్తుతం ఆమె ‘టెక్స్ట్‌ ఫర్‌ యూ’తో పాటు పలు టీవీ సిరీస్‌లు చేస్తున్నారు. 

Updated Date - 2021-12-25T05:30:00+05:30 IST