జాకెట్టు కుట్టు ఇలా!

ABN , First Publish Date - 2022-06-23T08:22:17+05:30 IST

సాధారణంగా బ్లౌజ్‌ కుట్టించాలనుకున్నప్పుడు ఆది బ్లౌజ్‌... టైలర్‌కి ఇచ్చేస్తూ ఉంటాం.

జాకెట్టు కుట్టు ఇలా!

నప్పే జాకెట్టు ధరిస్తేనే చీర కట్టు కంటికింపుగా ఉంటుంది. కాబట్టి బ్లౌజ్‌ కుట్టించేటప్పుడు, ధరించేటప్పుడు ఈ టిప్స్‌ పాటించాలి! 

కొలతలు కచ్చితంగా: సాధారణంగా బ్లౌజ్‌ కుట్టించాలనుకున్నప్పుడు ఆది బ్లౌజ్‌... టైలర్‌కి ఇచ్చేస్తూ ఉంటాం. కానీ ఒంటి తీరు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కాబట్టి కుట్టించే ప్రతిసారీ కొలతలు ఇవ్వడం తప్పనిసరి. అలాగే ఉపయోగించే బ్రాసరీ కొలతలు, టైలర్‌ కుట్టబోయే బ్లౌజ్‌ కొలతలు మ్యాచ్‌ అయ్యేలా చూసుకోవాలి. 

హుకప్‌ బటన్స్‌: బ్లౌజ్‌ లోపలి నుంచి బ్రాసరీ బయటకు తొంగి చూసే వీలు లేకుండా బ్లౌజ్‌ భుజాల దగ్గర హుకప్‌ బటన్స్‌ కుట్టమని టైలర్‌కు చెప్పాలి. 

మ్యాచింగ్‌ బ్లౌజ్‌: చీరతో పాటు వచ్చే బ్లౌజ్‌ పీస్‌కు బదులు విడిగా ఎంచుకోవాలనుకుంటే చీర మెటీరియల్‌తో బ్లౌజ్‌ మ్యాచ్‌ అయ్యేలా చూసుకోవాలి. అలాగే ఎంచుకునే లైనింగ్‌ నాణ్యతదై ఉండాలి. లేదంటే ఉతికిన తర్వాత కుంచించుకుపోయి బ్లౌజ్‌  ముడతలు పడే అవకాశాలుంటాయి. 

కాంబినేషన్‌: మ్యాచింగ్‌ బ్లౌజ్‌లకు కాలం చెల్లింది. ఇప్పుడంతా డిజైనర్‌ బ్లౌజులదే హవా. అయితే హెవీ ఎంబ్రాయిడరీ పనితనం ఉన్న చీరలకు ప్లెయిన్‌ డిజైనర్‌ బ్లౌజులు, ప్లెయిన్‌ చీరలకు సెక్విన్‌ వర్క్‌ ఉన్న బ్లౌజులు ఎంచుకోవాలి. కంజీవరం పట్టు చీరలకు బ్రొకేడ్‌, సిల్క్‌ లేదా వెల్వెట్‌ వెరైటీ బ్లౌజులను ప్రయత్నించవచ్చు. 

Updated Date - 2022-06-23T08:22:17+05:30 IST