విండోస్‌11 పిక్చర్‌ - ఇన్‌ - పిక్చర్‌ మోడ్‌ ఎనేబిలింగ్‌ ఇలా..

ABN , First Publish Date - 2022-05-14T08:43:01+05:30 IST

లాప్‌టాప్‌పై పనిచేసుకుంటూనే మరోవైపు వీడియోలు చూడాలనుకుంటున్నారా! అయితే ఇది మీ లాంటి వాళ్లకోసమే. పనికోసం లాప్‌టాప్‌, వీడియోల కోసం మొబైల్‌ కాదు.

విండోస్‌11 పిక్చర్‌ - ఇన్‌ - పిక్చర్‌ మోడ్‌ ఎనేబిలింగ్‌ ఇలా..

లాప్‌టాప్‌పై పనిచేసుకుంటూనే మరోవైపు వీడియోలు చూడాలనుకుంటున్నారా! అయితే ఇది మీ లాంటి వాళ్లకోసమే. పనికోసం లాప్‌టాప్‌, వీడియోల కోసం మొబైల్‌ కాదు. రెండు పనులూ లాప్‌టాప్‌లోనే  చేయొచ్చు. ఇందుకోసం విండోస్‌11పై పిక్చర్‌ - ఇన్‌ - పిక్చర్‌ మోడ్‌ని ఎనేబుల్‌ చేసుకుని హాయిగా వీడియోలు చూడొచ్చు. అప్పుడే ఒకపక్క ఫ్లోటింగ్‌ విండోలు వీడియోలు నడుస్తూ ఉంటాయి. మరో పక్క ఫుల్‌స్ర్కీన్‌పై మీ పని మీరు చేసుకుంటూ ఉండొచ్చు. విండోస్‌11పై ద ఫిల్మ్‌ అండ్‌ టీవీ యాప్‌ పిక్చర్‌ -ఇన్‌ - పిక్చర్‌ మోడ్‌ సపోర్ట్‌తో వస్తోంది. అయితే వీడియోలను కంప్యూటర్‌పై సేవ్‌ చేసుకుని ఉంటేనే ఈ ప్రక్రియకు ఆస్కారం ఉంటుంది. పిక్చర్‌ - ఇన్‌ - పిక్చర్‌ మోడ్‌లో యూట్యూబ్‌ వీడియోను ప్లే చేయాలని అనుకుంటే ఇంటర్నెట్‌ బ్రౌజర్‌, ఆ మోడ్‌కు సపోర్టు అవసరమవుతుంది. ప్రక్రియను ఎలా జరిపించవచ్చు అంటే..


  • మొదట ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌ని ఓపెన్‌ చేసుకోవాలి. పిక్చర్‌ - ఇన్‌ - పిక్చర్‌ మోడ్‌ కావాలని అనుకుంటే, వీడియో ఫైల్‌పై రైట్‌ క్లిక్‌ చేయాలి. 
  • ఇచ్చిన ఆప్షన్స్‌ను అనుసరించి ఇప్పుడు ఫిల్మ్స్‌ అండ్‌ టీవీని సెలెక్ట్‌ చేసుకోవాలి. 
  • ఒక్కసారి వీడియో ఓపెన్‌ అయితే, పిక్చర్‌ - ఇన్‌ - పిక్చర్‌ మోడ్‌లో నిరంతరాయంగా వీడియోను ప్లే చేసేందుకు మినీవ్యూలో ‘ప్లే వీడియో’పై క్లిక్‌ చేయాలి. 
  • ఇప్పుడు ఫ్లోటింగ్‌ విండో అంటే ఫుల్‌స్ర్కీన్‌ టాప్‌లో ఉండే దానిపై వీడియో ప్లే కొనసాగుతూ ఉంటుంది. 

Read more