వర్చ్యువల్‌ ఇంటర్వ్యూకు ఇలా...

ABN , First Publish Date - 2020-09-19T05:30:00+05:30 IST

ఉద్యోగం కోసం నేరుగా ఇంటర్వ్యూ చేసే పరిస్థితులు ఇప్పుడు లేవు. కరోనా భయంతో చాలా కంపెనీలు వర్చ్యువల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగులను ఎంపిక చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి.

వర్చ్యువల్‌ ఇంటర్వ్యూకు ఇలా...

ఉద్యోగం కోసం నేరుగా ఇంటర్వ్యూ చేసే పరిస్థితులు ఇప్పుడు లేవు. కరోనా భయంతో చాలా కంపెనీలు వర్చ్యువల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగులను ఎంపిక చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి. వర్చ్యువల్‌ ఇంటర్వ్యూ అనగానే కొందరిలో ఏదో తెలియని భయం, కంగారు మొదలవుతుంది. అయితే ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూకు సన్నద్ధమవ్వాలంటే ఇవి గుర్తుంచుకోవాలి.  


ఇంటర్నెట్‌ కనెక్షన్‌: ముందుగా మీ కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌కి ఇంటర్నెట్‌ సౌకర్యంలో ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. స్నేహితులు లేదా కుటుంబసభ్యుల్లో ఒకరికి వీడియో కాల్‌ చేసి వెబ్‌ కెమెరా, హెడ్‌ఫోన్‌లోని మైక్రోఫోన్‌ సరిగ్గా పనిచేస్తుందో, లేదో! చెక్‌ చేసుకోవాలి. 


గది ప్రశాంతంగా: వర్చ్యువల్‌ ఇంటర్య్యూ కోసం మీరు కూర్చొన్న గది ఆహ్లాదంగా ఉండాలి. వెలుతురు సరిపోనూ పడాలి. మీ ముఖం స్పష్టంగా కనిపించాలంటే వెనక ఏ వస్తువులు ఉండకూడదు. ఇంటర్వ్యూ సమయంలో మీరున్న గదిలోకి రావొద్దని ఇంట్లో వాళ్లకు ముందే చెప్పాలి. ఫోన్‌ను సైలెంట్‌ మోడ్‌లో పెట్టాలి. టీవీ ఆఫ్‌ చేయాలి. 


బాడీలాంగ్వేజ్‌: ఇంటర్య్యూ నిర్వహించే వాళ్లు మీరు తడబడుతున్నారా! వెంటనే జవాబు ఇస్తున్నారా! అనేది తేలిగ్గా పసిగడతారు. కాబట్టి అద్దం ముందు లేదా కుటుంబసభ్యుల ముందు   మీ బాడీలాంగ్వేజ్‌ను సరిచూసుకోవాలి.


సన్నద్ధం, ఆచరణ: ముందస్తు ప్రిపరేషన్‌ లేకుండా ఇంటర్వ్యూకు వెళ్లకూడదు. మీరు ఉద్యోగానికి దరఖాస్తు చేసిన కంపెనీ, కార్యకలాపాలు, ఇతర వివరాలు తెలుసుకోవాలి. అలానే ‘మా కంపెనీ గురించి మీకు ఏమేం తెలుసు? పనిలో భాగంగా ఎదురయ్యే సవాళ్లను మీరు ఎలా అధిగమిస్తారు? వంటి ప్రశ్నలను ముందే ఊహించి, అందుకు తగ్గట్టుగా సన్నద్ధమవ్వాలి. 


కూర్చొనే తీరు: వర్చ్యువల్‌ ఇంటర్వ్యూ సమయంలో ఫార్మల్‌ డ్రెస్‌ ధరించాలి. కుర్చీలో వాలిపోయినట్టు కాకుండా నిటారుగా కూర్చోవాలి. కెమెరా వైపు నుంచి చూపు మరల్చకూడదు.  


ఫాలో అప్‌: ఇంటర్వ్యూ చేసిన వాళ్లకు థ్యాంక్స్‌ చెప్పడం మార్యాద. మెయిల్‌ ద్వారా థ్యాంక్స్‌ చెప్పడంతో వారు మీకు ఆ ఉద్యోగం పట్ల ఆసక్తి ఉందని గ్రహిస్తారు.ఫ


Updated Date - 2020-09-19T05:30:00+05:30 IST