Abn logo
Mar 3 2021 @ 00:14AM

పిల్లల గది ఇలా...

పిల్లల ప్లే రూమ్‌, బెడ్‌రూమ్‌ల అమరిక తల్లులకు తీగ మీద నడక లాంటిదే! పిల్లలకు సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉండేలా ఆ గదులను అమర్చే బాధ్యత తల్లులదే! అందుకోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి!


పెద్ద శబ్దం చేసే ఆటబొమ్మలు: పెద్ద శబ్దాలు చేసే ఆటబొమ్మలను పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి శబ్దాలు చేసే బొమ్మలతో 15 నిమిషాల పాటు ఆడడం వల్ల పిల్లల వినికిడి శక్తి దెబ్బతినే ప్రమాదం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. కాబట్టి తక్కువ శబ్దాలు వెలువరించే బొమ్మలకే పిల్లల గదుల్లో చోటు కల్పించాలి.


బరువైన ఫర్నిచర్‌: కుదురుగా నిలబడని బరువైన ఫర్నిచర్‌ పిల్లల గదుల్లో ఉండకూడదు. కుర్చీలు, టేబుళ్లు, బెడ్‌ లాంటి బరువైన ఫర్నిచర్‌ కుదురుగా లేకపోతే, వాటిని ఎక్కబోతూ పిల్లలు కిందపడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ ఫర్నిచర్‌ తీరును ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండాలి. అలాగే గోడలకు బరువైన పెయింటింగ్స్‌, అద్దాలు, ఇతరత్రా పగిలే వీలున్న డెకరేటివ్‌ ఐటమ్స్‌ కూడా పిల్లల గదుల్లో ఉండకూడదు.


బేబీ వాకర్‌: వీటితో పిల్లలకు నడక త్వరగా వస్తుందనేది అపోహ! నిజానికి ఇవి నడిచే క్రమంలో పిల్లలు బ్యాలెన్స్‌ తప్పకుండా తోడ్పడతాయి. బేబీ వాకర్ల వల్ల పిల్లలు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి పలు విదేశాల్లో ప్రభుత్వాలు వీటిని బహిష్కరించాయి. కాబట్టి వాకర్లకు బదులుగా, సురక్షితంగా ఆడుకునే వీలుండే ప్లేపెన్‌ ఎంచుకోవచ్చు.

Advertisement
Advertisement
Advertisement