తెలంగాణ వచ్చాకే ప్రజల జీవితాల్లో వెలుగులు

ABN , First Publish Date - 2022-06-30T06:37:48+05:30 IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయ ని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. జిల్లాలోని పలు మండలాల్లో మంత్రి విస్తృత పర్యటన చేశారు. చం డూరు, మునుగోడు, నాంపల్లి, మర్రిగూ డ మండలాల్లో పర్యటించిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు అందజేసి మాట్లాడారు.

తెలంగాణ వచ్చాకే ప్రజల జీవితాల్లో వెలుగులు
కల్యాణలక్ష్మి, షాదీముభారక్‌ చెక్కులను అందజేస్తున్న మంత్రి

విద్యుత్‌శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి 

మునుగోడు, మునుగోడు రూరల్‌, చండూరు, చండూరు రూరల్‌, దేవరకొండ, మర్రిగూడ, జూన్‌ 29: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయ ని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. జిల్లాలోని పలు మండలాల్లో మంత్రి విస్తృత పర్యటన చేశారు. చం డూరు, మునుగోడు, నాంపల్లి, మర్రిగూ డ మండలాల్లో పర్యటించిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు అందజేసి మాట్లాడారు. రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమానికి చేపడుతున్న పథకాలతో సీఎం కేసీఆర్‌ దేశానికే మార్గదర్శిగా నిలిచారన్నారు. అభివృద్ది సంక్షేమం జోడెద్దుల్లా ముందుకు సాగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వచ్చిన తర్వాతే రాష్ట్ర ప్రజల్లో ఆత్మవిశ్వాసం, భరో సా పెరిగిందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు లో దేశానికే తెలంగాణ రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు. ముందుచూపుతో చేపట్టిన మిషన్‌ భగీరథ పథకంతో ము నుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్‌ సమస్య దూరమైందన్నారు. తెలంగాణ వంటి పాలనను దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని, అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవసరం దేశానికి ఉందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతుల కు నిరంతర విద్యుత్‌ ఇవ్వడం లేదన్నారు. కేవలం తెలంగాణలోనే సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ తోకల చం ద్రకళ వెంకన్న, జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ కోడి సుష్మ, కౌన్సిలర్లు గుం టి వెంకటేశం, కోడి వెంకన్న, అన్నెపర్తి శేఖర్‌, కొన్‌రెడ్డి యాదయ్య, చిలుకూరి రాధిక శ్రీనివాస్‌, తహసీల్దార్‌ మహేందర్‌రెడ్డి, ఎంపీడీవో జానయ్య, టీఆర్‌ఎస్‌ మండల, పట్టణ అధ్యక్షులు బొమ్మరబోయిన వెంకన్న, భూతరాజు దశరథ, మునుగోడు మండలంలో డీఎస్పీ నర్సింహ, ఎంపీపీ కర్నాటి స్వామి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీవో యాకుబ్‌ నాయక్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్రనేత నారబోయిన రవి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి, మర్రిగూడ మండలంలో దేవరకొండ ఆర్డీవో గోపీరాం, ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ సంఘమిత్ర, సర్పంచ్‌లు యాదయ్యగౌడ్‌, యాదగిరిరెడ్డి, సుధాకర్‌, నాంపల్లి మండలంలో ఎంపీపీ శ్వేత రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ వెంకటేశ్వరరెడ్డి, గుమ్మడపు నర్సింహరావు, కుంభం విజయకృష్ణారెడ్డి పాల్గొన్నారు.  


ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం 

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడ మే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. చం డూరులో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ఎంపికైన జడ్పీహైస్కూలో రూ.1.15కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ పథకంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు మరింత బలపడనున్నాయని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడానికి శ్రీకారం చుట్టిందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ గురువయ్య, హెచ్‌ఎం కరుణాకర్‌ రెడ్డి, ఎస్‌ఎంసీ చైర్మన్‌ దోటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2022-06-30T06:37:48+05:30 IST