పోలి పాడ్యమి పూజలు..

ABN , First Publish Date - 2021-12-06T04:58:39+05:30 IST

పోలి పాడ్యమి పర్వదినాన్ని పురస్కరించుకుని మహిళలు ఆదివారం తెల్లవారుజామున కోనేరులో కార్తీక దీపాలను వదిలారు.

పోలి పాడ్యమి పూజలు..
ద్వారకాతిరుమల పుష్కరిణిలో కార్తీక దీపాలు

ద్వారకాతిరుమల, డిసెంబరు 5: పోలి పాడ్యమి పర్వదినాన్ని పురస్కరించుకుని మహిళలు ఆదివారం తెల్లవారుజామున కోనేరులో కార్తీక దీపాలను వదిలారు. మహిళలంతా శ్రీవారి పుష్కరిణి వద్దకు చేరుకోవడంతో పండుగ వాతావరణం నెలకొంది. ముందుగా పుష్కరిణిలో కార్తీక పుణ్యస్నానాలను చేశారు. అనంతరం అరటి డొప్పలపై కార్తీక దీపాలను వెలిగించి పుష్కరిణిలోకి వదిలి నమస్కరించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పూజా కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి.


కామవరపుకోట: పోలిపాడ్యమి సందర్భంగా ఆదివారం పలు గ్రామాల్లో మహిళలు అరటి డొప్పల్లో ఒత్తులను వెలిగించి కాలువల్లో వదిలారు. ఈ మేరకు రామన్నపాలెంలో దీపాలతో ప్రత్యేక అలంకరణ ఆకట్టుకుంది. మద్దిపోటి సుబ్బలక్ష్మీనాగేశ్వరరావు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - 2021-12-06T04:58:39+05:30 IST