మెరుపు..ఉరుము..ఇక తుపాను!

ABN , First Publish Date - 2021-06-22T09:48:52+05:30 IST

స్ర్పింట్‌ దిగ్గజం, జమైకా చిరుత ఉసేన్‌ బోల్ట్‌ కవల పిల్లలకు తండ్రయ్యాడు. ఆదివారం ఫాదర్స్‌ డే రోజున అతడు తన ఇద్దరు బాబులతో కూడిన ఫ్యామిలీ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.

మెరుపు..ఉరుము..ఇక తుపాను!

కింగ్‌స్టన్‌: స్ర్పింట్‌ దిగ్గజం,  జమైకా చిరుత ఉసేన్‌ బోల్ట్‌ కవల పిల్లలకు తండ్రయ్యాడు. ఆదివారం ఫాదర్స్‌ డే రోజున అతడు తన ఇద్దరు బాబులతో కూడిన ఫ్యామిలీ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. అయితే తన ట్విన్స్‌కు పెట్టిన పేర్లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇంతకీ ఆ పేర్లేమిటంటే.. ఒకరు థండర్‌ బోల్ట్‌ మరొకరు సెయింట్‌ లియో బోల్ట్‌. అంతేకాదు.. గతేడాది మేలో పుట్టిన పాపకు అతడు ఒలింపియా లైట్నింగ్‌ బోల్ట్‌ అనే పేరు పెట్టాడు. ఈ ఆసక్తికర పేర్లు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘లైట్నింగ్‌ (మెరుపు).. థండర్‌ (ఉరుము). ఇంకేముంది ఇక్కడ తుపాను రావడం ఖాయం’ అంటూ ఓ అభిమాని సరదాగా ట్వీట్‌ చేసింది. అయితే, ఈ కవలలు ఎప్పుడు పుట్టారన్నది మాత్రం బోల్ట్‌ వెల్లడించలేదు. 

Updated Date - 2021-06-22T09:48:52+05:30 IST