పుచ్చకాయతో మేనికి మెరుపు

ABN , First Publish Date - 2021-03-14T05:30:00+05:30 IST

వేసవి వచ్చిందంటే అందరికీ గుర్తుకు వచ్చేది పుచ్చకాయే. ఇది వేసవిలో దాహార్తి తీర్చడమే కాదు ఆరోగ్యానికీ ఎంతో మంచిది. బ్యూటీకి కూడా పుచ్చకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. అదెలాగంటే...

పుచ్చకాయతో మేనికి మెరుపు

వేసవి వచ్చిందంటే అందరికీ గుర్తుకు వచ్చేది పుచ్చకాయే. ఇది వేసవిలో దాహార్తి తీర్చడమే కాదు ఆరోగ్యానికీ ఎంతో మంచిది. బ్యూటీకి కూడా పుచ్చకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. అదెలాగంటే... 

  • చిన్న పుచ్చకాయ ముక్కను ముఖానికి రాసుకుంటే అది చర్మ గ్రంథులను శుభ్రం చేస్తుంది. పుచ్చకాయ రసంలో కొద్దిగా పుదీనా రసం కలిపి ఫ్రిజ్‌లో ఉంచి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటుంటే కాంతివంతమవుతుంది. 
  • ఎండలో తిరిగి వచ్చినప్పుడు శరీరంపై ఎండ ప్రభావంతో పాటు దుమ్ము, ధూళి కూడా ఉంటాయి. అప్పుడు పుచ్చకాయ రసంలో కొద్దిగా తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే మంచి టోనర్‌గా పనిచేస్తుంది. చర్మంపై చేరిన మురికిని పోగొడుతుంది. 
  • చర్మంపై ముడతలు, మచ్చలు కనిపిస్తుంటే పుచ్చకాయ రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని రాత్రి ముఖానికి రాసుకుని పడుకోవాలి. పొద్దున్న లే చిన వెంటనే చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంలో అలసట లేకుండా ఎంతో తాజాగా ఉంటుంది.

Read more