Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 24 Apr 2022 00:18:13 IST

మూడు పదుల్లో మెరుపులు

twitter-iconwatsapp-iconfb-icon

ఇరవై ఏళ్ల వయసులో  ఉన్న హీరోయిన్లకు సినీ ఫిల్డ్‌లో ఉన్న క్రేజ్‌ వేరు. వయసు పెరుగుత్ను కొద్దీ కెరీర్‌ గ్రాఫ్‌ డౌన్‌ అవుతుంటుంది. దానికి తోడు కొత్తగా వచ్చే హీరోయిన్ల నుంచీ పోటీ ఉండనే ఉంటుంది. కాస్త వెనుకబడితో చాలు హీరోయిన్‌ ఛాన్సులు తగ్గిపోయి, అక్క, చెల్లి పాత్రలకు పరిమితం కావాల్సి ఉంటుంది. ఇంత టఫ్‌ కాంపిటీషన్‌లోనూ కొంతమంది హీరోయిన్లు 30 ఏళ్లు దాటినా ఇండస్ట్రీలో తమ హవా కొనసాగిస్తున్నారు. ఇటు కుర్రహీరోలు, అటు అగ్ర హీరోలతో సినిమాలు చేస్తూ ట్రెండింగ్‌లో ఉంటున్నారు.

మూడు పదుల్లో మెరుపులు

జోరు తగ్గలేదు

ఈ కోవలో ముందు చెప్పుకోవాల్సిన పేరు అనుష్కశెట్టి. 40వ ఏటలోకి అడుగుపెట్టినా ఇప్పటికీ  కథానాయికగా టాప్‌ పొజిషన్‌లో ఉండడం  ఆమెకే చెల్లింది. ‘బాహుబలి’ సిరీస్‌ తర్వాత అనుష్క చేసిన సినిమాలు ఆ స్థాయిలో విజయాలు సాధించలేదు. అయినా సరే టాలీవుడ్‌లో ఆమె క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆమెతో సినిమా చేయడానికి అగ్రహీరోలు, నిర్మాతలు సిద్ధంగా ఉన్నా అనుష్క మాత్రం ఆచితూచి కథలు ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఓ చిత్రం చేస్తున్నారు. నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడు. మహేష్‌బాబు పి. దర్శకత్వం వహిస్తున్నారు. 

మూడు పదుల్లో మెరుపులు

డిమాండ్‌ తగ్గలేదు

వయసుతో పాటు హీరోయిన్‌గానూ డిమాండ్‌ పెరుగుతోన్న తార సమంత. టాలీవుడ్‌లో అగ్రతారగా కొనసాగుతున్న సమంత వయసు మూడు పదులు దాటింది. ఇప్పుడు ఆమె కెరీర్‌ పీక్స్‌లో ఉంది. ప్రస్తుతం లీడ్‌రోల్‌లో రెండు పాన్‌ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. గుణశేఖర్‌ దర్శకత్వంలో నటించిన ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధమవుతుండగా, భారీ యాక్షన్‌ చిత్రం ‘యశోద’ సెట్స్‌పై ఉంది. కథానాయిక ప్రాధాన్య పాత్రల్లోనే కాదు విజయ్‌ దేవర కొండ  పక్కన ఆమె కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవలె ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. అడపా దడపా తమిళంలోనూ సమంత నటిస్తున్నారు. ‘కాథువాక్కుల రెండు కాదల్‌’లో విజయ్‌సేతుపతితో జోడీ కట్టారు సమంత. ఈ చిత్రం ఈ నెలాఖరుకు ప్రేక్షకుల ముందుకొస్తోంది. 

మూడు పదుల్లో మెరుపులు

లేడీ సూపర్‌స్టార్‌

దక్షిణాదిన అన్ని భాషల్లోనూ అగ్రహీరోలతో సినిమాలు చేస్తూ లేడీ సూపర్‌స్టార్‌గా పేరు పొందారు నయనతార. కథానాయిక ఆమెది దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌. అయినా ప్రేక్షకుల్లో ఏ మాత్రం క్రేజ్‌ తగ్గలేదు. ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో అరడజను చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. వీటిలో చాలా వరకూ అగ్రహీరోల చిత్రాలే కావడం విశేషం. ిఅట్లీ దర్శకత్వంలో షారూఖ్‌ఖాన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రంలో నయనతార కథానాయిక. చిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌’లో కీలకపాత్రలో ఆమె నటిస్తున్నారు. 

మూడు పదుల్లో మెరుపులు

స్పీడ్‌ పెంచారు

హీరోయిన్‌గా ఫుల్‌ ఫామ్‌లో ఉన్నారు పూజాహెగ్డే. దక్షిణాదిన అత్యధిక పారితోషికం అందుకుంటున్నారు. ఈ ఏడాది ‘రాధేశ్యామ్‌’, ‘బీస్ట్‌’ చిత్రాల్లో అలరించిన పూజా త్వరలో ‘ఆచార్య’తో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. మూడు పదుల వయసులోకి అడుగుపెట్టిన పూజా సల్మాన్‌తో ఓ బాలీవుడ్‌ చిత్రం చేస్తున్నారు. రణ్‌వీర్‌సింగ్‌తో ‘సర్కస్‌’ చిత్రంలో నటిస్తున్నారు. హరీష్‌ శంకర్‌ దర ్శకత్వంలో పవన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘భవదీయుడు భగత్‌సింగ్‌’లో పూజా కథానాయిక. 

మూడు పదుల్లో మెరుపులు

‘సలార్‌’ చిత్రంతో పాన్‌ ఇండియా కథానాయిక అయ్యారు శ్రుతిహాసన్‌. వయసు 40కు దగ్గరపడుతున్నా వెండితెరపై తళుక్కున మెరుస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో ఇద్దరు అగ్రహీరోలు చిరంజీవి, బాలకృష్ణ సరసన ఆమె నటిస్తున్నారు. 

మూడు పదుల్లో మెరుపులు

మూడు పదుల వయసులోనూ అభిమానులను వెండితెరపై మురిపిస్తున్న కథానాయికలు మరికొందరు ఉన్నారు. కాజల్‌ అగర్వాల్‌ చిరంజీవి సరసన నటించిన ‘ఆచార్య’ చిత్రం ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇటీవలె బాబుకు జన్మనిచ్చిన కాజల్‌ సినిమాలకు చిన్న బ్రేక్‌ ఇచ్చారు. తమన్నా చిరు సరసన ‘భోళాశంకర్‌’ చిత్రంలో నటిస్తున్నారు. త్రిష ప్రస్తుతం తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తున్నారు. 

మూడు పదుల్లో మెరుపులు

ఈ ఏడాది ‘భీమ్లానాయక్‌’ చిత్రంలో పవన్‌ భార్య పాత్రలో నిత్యామీనన్‌ తెలుగు ప్రేక్షకులను పలకరించారు. 30 ఏళ్లు దాటినా ఆమె కెరీర్‌ స్పీడ్‌ తగ్గలేదు. ప్రస్తుతం మలయాళం, తమిళంలో ఆమె నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 

మూడు పదుల్లో మెరుపులు

కొన్నేళ్ల గ్యాప్‌ తర్వాత ఇటీవలె ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ చిత్రంలో లీడ్‌రోల్‌లో తాప్సీ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ చిత్రాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు తాప్సీ. మూడు పదుల వయసులోనూ బాలీవుడ్‌లో మంచి హిట్లతో దూసుకుపోతున్నారామె.  షారూఖ్‌ ఖాన్‌ సరసన ‘డంకీ’ చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో ‘ఏలియన్‌’ చేస్తున్నారు. ‘బ్లర్‌’ చిత్రంలో నటిస్తూ సొంతంగా నిర్మిస్తున్నారు.  ‘దొబారా’, ‘శభాష్‌ మిథు’ షూటింగ్‌ పూర్తయ్యాయి. సౌత్‌లో 30 ఏళ్లు దాటినా 40వ పడిలోకి దగ్గరపడుతున్నా హీరోయిన్‌గా అదే జోరు కొనసాగిస్తున్నారు. హీరోయిన్లుగా వారి ప్రాభవం ఏ మాత్రం తగ్గడం లేదు. మొత్తం మీద వాళ్లకు వయసు ఒక నంబరు మాత్రమే. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.