అంజన్నకు లఘుపూర్ణాహుతి

ABN , First Publish Date - 2022-05-24T05:25:16+05:30 IST

గండి వీరాంజనేయస్వామి దేవస్థానంలో ఆదివారం నుంచి ప్రారంభమైన హనుమత్‌జయంతి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు అంజన్నకు లఘుపూర్ణాహుతి నిర్వహించారు.

అంజన్నకు లఘుపూర్ణాహుతి
అంజన్నకు లఘుపూర్ణాహుతి నిర్వహిస్తున్న దృశ్యం

చక్రాయపేట, మే 23: గండి వీరాంజనేయస్వామి దేవస్థానంలో ఆదివారం నుంచి ప్రారంభమైన హనుమత్‌జయంతి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు అంజన్నకు లఘుపూర్ణాహుతి నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం కుంభ ఆవాహన, ద్వారార్చన, పంచసూక్త హోమం, త్రికాల ఆరాధన, స్నపనతిరుమంజనం, పుణ్యాఃవాచనం, రక్షాబంధన ధారణి, గోష్టి తదితర కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషననర్‌ అలవలపాటి ముకుందరెడ్డి దంపతులు, చైర్మన్‌ పినుపోలు రాఘవేంద్రప్రసాద్‌, ప్రధాన, ఉప ప్రధాన అర్చకులు కేసరి స్వామి, రాజాస్వామి, యాజ్ఞాచార్యులు రామకృష్ణ, వేదపారాయణ పండితులు రామ్మోహన్‌శర్మ, అర్చకులు గోపాలస్వామి, రఘుస్వామి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-24T05:25:16+05:30 IST