Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 19 Aug 2022 10:53:18 IST

Liger: ఇదే ఊపు కొనసాగిస్తుందా..?

twitter-iconwatsapp-iconfb-icon

లైగర్ (Liger)..ఇప్పుడు ఈ సినిమా మీదే అందరి దృష్టీ ఉంది. దాదాపు నిర్మాణంలో రెండేళ్ళ పాటు ఉన్న ఈ సినిమా ఎట్టకేలకి ఈ నెల 25వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా ఇది. అయితే, ఇటీవల వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళపరంగా కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. చెప్పాలంటే ఈ ఏడాది మార్చ్‌లో వచ్చిన ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 చిత్రాల తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్స్ గానీ, ఆ ఊపుగానీ జూన్ వరకూ కనిపించలేదు. కానీ, ఈ ఏడాది ద్వితీయార్థంలో మాత్రం మంచి జోరు కనిపిస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమకి కొత్త ఊపు మొదలైందని సీతా రామం (Sita Ramam), కార్తికేయ 2 (Karthikeya 2), బింబిసార (Bimbisara) చిత్రాలు చెబుతున్నాయి. 

భారీ అంచనాల మధ్య వచ్చిన రాధే శ్యామ్, ఆచార్య, సర్కారు వారి పాట, పక్కా కమర్షియల్ లాంటి పెద్ద సినిమాలు మొదటి అర్థభాగంలో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 చిత్రాలు తెచ్చిన ఊపును కొనసాగించలేకపోయాయి. అందుకే, ఇప్పుడు లైగర్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. అందరూ పెట్టుకున్న అంచనాలను నిజం చేశాయి సీతా రామం, కార్తికేయ 2, బింబిసార చిత్రాలు. వీటి క్రమంలో ఆగస్టు 25న లైగర్ తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే, ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీది బాగా అంచనాలను పెంచాయి. 

ఈ అంచనాలను రెట్టింపు చేస్తూ లైగర్ టీమ్ సౌత్, నార్త్‌లలో జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. పూరి సినిమా అయితే భార్ హిట్ సాధిస్తుంది. లేదా ఒక్క షోతో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటుంది. అందుకే, ఇండస్ట్రీలో ప్రస్తుతం కొనసాగుతున్న జోష్‌ను పూరి లైగర్ కొనసాగిస్తుందా..అంటూ మాట్లాడుకుంటున్నారు. చూడాలి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో. ధర్మ ప్రొడక్షన్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జొహార్ నిర్మించారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా సౌత్‌కి పరిచయమవుతోంది. రమ్యకృష్ణ, మైక్ టైసన్, మకరంద్ దేశ్ పాండే కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement