Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 06 Jul 2022 21:16:42 IST

Liger: ఫస్ట్ సింగల్ వచ్చేస్తోంది

twitter-iconwatsapp-iconfb-icon

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లైగర్’ (Liger)(సాలా క్రాస్‌బ్రీడ్). విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీది ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలను క్రియేట్ చేశాయి. ఆ అంచనాలను మరింత పెంచేలా.. ఇప్పుడు చిత్రయూనిట్ మ్యూజిక్ ప్రమోషన్స్‌ని ప్రారంభిస్తున్నట్లుగా చెబుతూ.. ఫస్ట్ సింగిల్ విడుదలకు సంబంధించిన సమాచారాన్ని కూడా చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది. ‘లైగర్’ ఫస్ట్ సింగిల్ అక్డీ పక్డీ ప్రోమోని జూలై 8న, పూర్తి పాటని 11న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ తెలుపుతూ ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ని విడుదల చేశారు. 


ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఫుల్ హ్యాపీ మూడ్‌లో కనిపించారు. ఈ పోస్టర్ విజయ్ దేవరకొండ తన చేత్తో అనన్య చేత విజల్ కొట్టించేలా చూపించడం అలరించింది. ఈ పార్టీ సాంగ్ పెప్పీ నెంబర్‌గా వుండబోతుందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ రెడ్ బ్లేజర్‌లో కనిపిస్తుండగా, అనన్య బ్లాక్ అవుట్ ఫిట్స్ లో మెరుస్తోంది. పబ్ సెట్‌లో ఈ పాట చిత్రీకరించారు. ఈ పాటని లిజో జార్జ్-డిజె చేతాస్ స్వరపరచగా, హుక్‌లైన్ సునీల్ కశ్యప్ ఇవ్వగా, అజీమ్ దయాని మ్యూజిక్ ని సూపర్ వైజ్ చేశారు. దేవ్ నేగి, పావ్నీ పాండే, లిజో జార్జ్ ఈ పాట హిందీ వెర్షన్‌ను పాడారు. ఈ పాటకు మొహ్సిన్ షేక్, అజీమ్ దయాని సాహిత్యం అందించారు.


తెలుగులో అనురాగ్ కులకర్ణి,  రమ్య బెహరా ఆలపించగా, భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యాన్ని అందించారు. తమిళ వెర్షన్‌ కు సాగర్ సాహిత్యం అందించగా వైష్ణవి కొవ్వూరి, సాగర్ కలసి పాడారు. విష్ణు వర్ధన్, శ్యామ మలయాళ వెర్షన్‌ని ఆలపించగా, సిజు తురవూర్ సాహిత్యం అందించారు. వరదరాజ్ చిక్కబళ్లాపుర రాసిన ఈ పాట కన్నడ వెర్షన్‌ ని సంతోష్ వెంకీ, సంగీత రవిచంద్రనాథ్‌లు ఆలపించారు. సాగర్ సౌత్ మ్యూజిక్ అడ్మినిస్ట్రేటర్‌గా వున్నారు. కాగా.. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement