సర్పంచ్‌, ఉపసర్పంచ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత

ABN , First Publish Date - 2022-05-25T05:11:30+05:30 IST

ఇటీవల నిధుల దుర్వినియోగంపై సస్పెన్షన్‌కు

సర్పంచ్‌, ఉపసర్పంచ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత

కందుకూరు, మే 24: ఇటీవల నిధుల దుర్వినియోగంపై సస్పెన్షన్‌కు గురైన బాచుపల్లి సర్పంచ్‌ యాలాల శ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌ కె.ప్రేమలత తిరిగి మంగళవారం బాధ్యతలు తీసుకున్నారు. కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఆదేశానుసారం సంబంధిత అధికారులు నిధుల దుర్వినియోగంపై విచారణ చేయగా సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లు నిధులు దుర్వినియోగం చేయలేదని తేలింది. దీంతో మంగళవారం కలెక్టర్‌ వారిపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు వెల్లడించారు. కాగా పంచాయతీ కార్యదర్శి విజయభాస్కర్‌ సస్పెండ్‌పై విచారణ కొనసాగుతోంది.


Updated Date - 2022-05-25T05:11:30+05:30 IST