శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-07-29T01:10:00+05:30 IST

శ్రీశైలం డ్యామ్ రెండు గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఇన్‌ఫ్లో 4.65 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 55 వేల క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.

శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత

శ్రీశైలం: శ్రీశైలం డ్యామ్ రెండు గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఇన్‌ఫ్లో 4.65 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 55 వేల క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ఎగువ నుంచి వరద కొనసాగుతుండడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నవారిని అధికారులు అప్రమత్తం చేశారు. శ్రీశైలం గేట్లు ఎత్తునున్న సమాచారం తెలుసుకున్న పర్యాటకులు డ్యాంను తిలకించేందుకు భారీగా వస్తున్నారు. మల్లన్న దర్శనానికి వచ్చిన భక్తులు డ్యాం వద్ద కృష్ణమ్మ పరవళ్లు చూసేందుకు తరలివస్తున్నారు. దీంతో శ్రీశైలంలో జలకళతో పాటు సందర్శకుల తాకిడి పెరిగింది.

Updated Date - 2021-07-29T01:10:00+05:30 IST