బీటీపీ గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2022-08-06T05:57:53+05:30 IST

భైరవానతిప్ప రిజర్వాయర్‌కు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు నీటి మట్టం 1655 అడుగులు కాగా.. శుక్రవారం సాయంత్రానికి 1654.8 అడుగులకు నీరు చేరుకుంది.

బీటీపీ గేట్లు ఎత్తివేత
బీటీపీ గేట్ల నుంచి నదిలోకి నీరు..

గుమ్మఘట్ట, ఆగస్టు 5: భైరవానతిప్ప రిజర్వాయర్‌కు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు నీటి మట్టం 1655 అడుగులు కాగా.. శుక్రవారం సాయంత్రానికి 1654.8 అడుగులకు నీరు చేరుకుంది. ఇరిగేషన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా నాలుగు గేట్లను తెరిచి, వేదావతి హగరికి 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎడమ కాలువ కింద చెరువులకు 150 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కర్ణాటక నుంచి వేదావతి హగరికి మూడు వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ నేపథ్యంలో దిగువకు నీరు వదిలామని ఇరిగేషన అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు పూర్తిస్థాయి సామర్థ్యం రెండు టీఎంసీల నీరు చేరింది. దీంతో రెండు మూడు రోజుల్లో కర్ణాటక నుంచి వస్తున్న వరదకు అనుగుణంగా మరిన్ని గేట్లను ఎత్తి, దిగువకు నీరు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. గేట్లు ఎత్తడంతో కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతాల నుంచి వందలాది మంది పర్యాటకులు తరలివస్తున్నారు. 

Updated Date - 2022-08-06T05:57:53+05:30 IST