Advertisement
Advertisement
Abn logo
Advertisement

పార్టీలో కోవర్టులను ఏరిపారేస్తా

  • లోకల్‌ నేతల అతి విశ్వాసంతోనే మునిసిపల్‌ ఎన్నికల్లో పరాజయం
  • కుప్పం సమీక్షలో చంద్రబాబు
  • ‘నియోజకవర్గం’లో ఇల్లు కట్టుకోండి
  • కోరిన స్థానిక నేతలు... ఓకే అన్న బాబు


అమరావతి, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ‘‘పార్టీలో కొన్నిచోట్ల కోవర్టులు తయారయ్యారు. వారిని ఏరిపారేస్తా’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఇక్క డ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో కుప్పం మునిసిపల్‌ ఎన్నికల సమీక్ష నిర్వహించారు. ‘‘ఒక్క కుప్పమే కాదు... మరి కొన్నిచోట్ల కూడా ఈ కోవర్టులు తయారయ్యారు. పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారు. కేసులు, దాడులకు భయపడకుండా వేల మంది పార్టీ కార్యకర్తలు పోరాడుతుంటే కొంత మంది ప్రత్యర్థులకు భయపడి లొంగిపోయి వ్యవహరిస్తున్నారు. అటువంటి వారిని ఉపేక్షించే సమస్య లేదు’’ అని వ్యాఖ్యానించిన ట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో ప్రజల్లో పనిచేయకుం డా తనను మెప్పించడం కోసం ప్రయత్నిస్తే ఏ ఉపయోగం ఉండదని, ప్రజల్లో పనిచేసే వారినే పార్టీ గుర్తిస్తుందని చెప్పారు. కుప్పంపై అధికార పార్టీ అనేక నెలలుగా తీవ్రంగా దృష్టి కేంద్రీకరించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా స్థానిక నేతలు అతి విశ్వాసం తో వ్యవహరించారని, దానివల్లే కుప్పం మునిసిపల్‌ ఎన్నికల్లో పరాజయం చవిచూడాల్సి వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ కనీవినీ ఎరుగని స్థాయిలో అరాచకాలకు పాల్పడిందని, ప్రశాంతతకు మారుపేరైన కుప్పంలో ఇటువంటి ఎన్నికల వాతావరణాన్ని తాము ఏనాడూ చూడలేదని స్థానిక నేతలు ఆయనకు వివరించారు. స్థానిక నాయకత్వంలో కొన్ని మార్పులు అవసరమని వారు చెప్పారు. నాయకత్వంలో మార్పుల అవసరం తనకూ కనిపిస్తోందని, కొత్త తరానికి ప్రాతినిధ్యం ఇస్తూ మార్పుచేర్పులు చేస్తానని చంద్రబాబు వారికి చెప్పారు.


రాష్ట్రంలో మొ త్తం పార్టీని నడిపే బాధ్యత ఉన్నా కుప్పం ప్రజలకు కూడా చంద్రబాబు కొంత సమయం ఇవ్వాలని స్థానిక నాయకులు కోరారు. చంద్రబాబు నియోజకవర్గ పర్యటనకు వస్తే ఆయనకు అతిథి గృహం ఇవ్వకుండా వేధిస్తున్నారని.. కుప్పంలో ఇల్లు నిర్మించుకొంటే బాగుంటుందన్నారు. దీంతో తప్పనిసరిగా కుప్పంలో ఇంటి నిర్మాణం చేపడతానని బాబు చెప్పారు. 


‘క్రమబద్ధీకరణ’కు 10 వేల కోట్లు వసూలు

‘‘లే అవుట్ల క్రమబద్ధీకరణ పేరుతో జగన్‌ ప్రభుత్వం ఇప్పటికే రూ.10 వేల కోట్లు వసూలు చేసింది. అది చాలదన్నట్లు మళ్ళీ లేఅవుట్లలో 5ు వాటా కావాలం టూ అదనపు బాదుడుకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలను పీడించుకొని తినడంలో ప్రభుత్వ పిచ్చి పరాకాష్ఠకు చేరుతోంది’’ అని టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి విమర్శించారు.  ప్రభుత్వం రౌడీయిజం చేస్తూ పేదల నుంచి ఇంటికి రూ.10 వేలు వసూలు చేసే బదులు ఉచితంగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు చేస్తే ప్రతిపక్షాలు మాట్లాడే అవకాశమే ఉండదని వ్యాఖ్యానించారు.  


అర్ధాకలితో చంపుతారా?: పీతల సుజాత

‘‘వైసీపీ రంగులు వేయడానికి, తీయడానికి ఈ ప్ర భుత్వం రూ.3,500 కోట్లు తగలబెట్టింది. హాస్టళ్లు, పాఠశాలల్లో పిల్లలు తిండిలేక అలమటిస్తుంటే వారికి రూ. 500 కోట్లు ఇవ్వలేరా? అర్ధాకలితో చంపుతారా?’’ అని మాజీ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు.   


ఎదురు దాడి రివాజు!: మంతెన

పార్లమెంట్‌ సాక్షిగా ఎంపీ రఘురామకృష్ణరాజును వైసీపీ అవమానించడాన్ని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ఖండించారు. సమస్యను ఎత్తిచూపితే, ఎదురు దాడికి దిగడం వైసీపీ ప్రభుత్వంలో రివాజుగా మారిందని మండిపడ్డారు. వరదల అంశా న్ని పక్కదారి పట్టించడానికి గతనెల 19న రాష్ట్ర అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి వ్యక్తిత్వ హననానికి పాల్ప డ్డ వైసీపీ నేతలు.. పార్లమెంట్‌లో ఎంపీ రఘురామపై వ్యక్తిగత దూషణకు దిగడం ఏమాత్రం క్షంతవ్యం కాదని బుధవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.   


ప్రతి ఎకరాకూ పరిహారం: మర్రెడ్డి

నవంబరులో వరదలు, తుఫాన్లకు రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టపోయిన రైతుల ప్రతి ఎకరాకు, చనిపోయిన ప్రతి ప్రాణికీ పరిహారం ఇవ్వాల్సిందేనని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్‌ చేశారు.  


Advertisement
Advertisement