అపోలో చైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డికి లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

ABN , First Publish Date - 2022-06-25T09:03:05+05:30 IST

అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డికి యంగ్‌ డాక్టర్స్‌ లీడర్‌షిప్‌ సమ్మిట్‌లో లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

అపోలో చైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డికి లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డికి యంగ్‌ డాక్టర్స్‌ లీడర్‌షిప్‌ సమ్మిట్‌లో లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు లభించింది. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ తమిళనాడు స్టేట్‌ బ్రాంచ్‌, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జూనియర్‌ డాక్టర్స్‌ నెట్‌వర్క్‌ తమిళనాడు కలిసి ప్రపంచ యువ వైద్యుల దినోత్సవం నిర్వహించిన సందర్భంగా ప్రతాప్‌ సి రెడ్డికి ఈ అవార్డు ఇచ్చారు. ప్రపంచ స్థాయి వైద్య సేవలను భారత్‌లో అందుబాటులోకి తీసుకురావడానికి ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డు అందజేశారు. 

Updated Date - 2022-06-25T09:03:05+05:30 IST