కేంద్రం పఽథకాలతో మారిన పేదల జీవన శైలి

ABN , First Publish Date - 2022-07-02T06:01:24+05:30 IST

కేంద్రంలోని బీజేపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో నిరుపేదల జీవనశైలి మారిపోయిందని, పార్టీపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగిందనికేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి వీరేంద్రకుమార్‌ అన్నారు.

కేంద్రం పఽథకాలతో మారిన పేదల జీవన శైలి
సిరిసిల్లలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి వీరేంద్రకుమార్‌ కాతిల్‌

- కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి వీరేంద్రకుమార్‌

సిరిసిల్ల రూరల్‌, జూలై 1 : కేంద్రంలోని బీజేపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో నిరుపేదల జీవనశైలి మారిపోయిందని, పార్టీపై  ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగిందనికేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి వీరేంద్రకుమార్‌ అన్నారు. బీజేపీ సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా  శుక్రవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో  నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు.  సమావేశానికి హర్యాన క్రీడా శాఖ మంత్రి సందీప్‌ సింగ్‌ రావాల్సి ఉండగా అనివార్య కారణాలతో పర్యటన రద్దు అయ్యింది. చొప్పదండి నియోజకవర్గం ఇన్‌చార్జిగా వచ్చిన మంత్రి వీరేంద్రకుమార్‌ ఖతీక్‌ సిరిసిల్ల సమావేశానికి వచ్చారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, పధాధికారులు, శక్తి కేంద్రాలు, బూత్‌ కమిటీ సభ్యులతో సమావేశం అయ్యారు. ఎనిమిదేళ్ల కాలంలో నిరుపేదల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పఽథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. దేశంలో చేపట్టిన పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరిపోయిందని, తెలంగాణలో సైతం ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని అన్నారు. తెలంగాణలో ఇటీవల జరిగిన రెండు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీపై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులు గెలుపొందినట్లు గుర్తు చేశారు.   తెలంగాణలో జరుగబోయో ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, సర్కార్‌ను ఏర్పాటు చేస్తుందని అన్నారు.   పార్టీపై ప్రజల్లో మరింత నమ్మకం పెంచడానికి హైదరాబాద్‌ వేదికగా జూలై 2, 3వ తేదీల్లో  బీజేపీ జాతీయ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  పార్టీని మరింత బలోపేతం చేయడానికి బూత్‌ స్థాఽయిలో నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లాలని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం కేంద్రమంత్రిని నాయకులు ఘనంగా సన్మానించారు.  సమావేశంలో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, జిల్లా ఇన్‌చార్జి గంగాడి మోహన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపీ, రాష్ట్ర కమిటీ సభ్యుడు అవునూరి రమాకాంత్‌రావు, పట్టణ అఽధ్యక్షుడు అన్నల్‌దాస్‌ వేణు, మహిళా మోర్చా జిల్లా అఽధ్యక్షురాలు బర్కం వెంకటలక్ష్మీ, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి గౌడ వాసు, బీజేవైఎం జిల్లా అఽధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, శీలం రాజు, బర్కం నవీన్‌యాదవ్‌, కైలాస్‌, సూరువు వెంకటి, కౌన్సిలర్‌ బోల్గం నాగరాజుగౌడ్‌, చెన్నమనేని కమాలాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-02T06:01:24+05:30 IST