Abn logo
May 31 2020 @ 00:07AM

రోజులు మారాయి..!

ఇప్పుడు ఏదైనా లోతుగా మాట్లాడుకోవాలంటే... కరోనాకు ముందు... తరువాత అని చెప్పుకోవాలి. ఈ మహమ్మారీ జనజీవనంపై అంతగా ప్రభావం చూపింది. ఉపాధి కరువై... పరిస్థితులు తారుమారయ్యాయి. దీంతో కొందరు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అలాంటిదే ఈ చిత్రం. 


మెక్సికన్‌ సంప్రదాయ సంగీతం ‘మరియాకి’ కళాకారులు వీరు. వయొలిన్‌, గిటార్‌ తదితర వాద్యాలతో మెక్సికో ప్రాంతాల్లోని సంగీతాన్ని వినిపించే బృందాలకు ‘మరియాకి’ అని పేరు. ఇద్దరే ఉంటే దాన్ని ‘మరియాకి ద్వయం’ అంటారు. అలాంటి ‘ద్వయమే’ ఇక్కడ కనిపిస్తున్న సెర్జియో కార్పియో, మెలీసా విల్లార్‌! విందులు, వినోదాలకు ‘మరియాకి’ అక్కడ సర్వసాధారణం. దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ఈ జంట ఉపాధి కోల్పోయింది. దీంతో వినూత్నంగా ఆలోచించారు. ఇంటి వద్ద నుంచే ఆన్‌లైన్‌లో ఇలా సంగీతం వినిపిస్తున్నారు. అందుకు పాటకు 30 డాలర్లు ఛార్జ్‌ చేస్తున్నారు. కావల్సినవారు ఆన్‌లైన్‌ ద్వారా వీరి బ్యాంక్‌ ఖాతాకు డబ్బులు పంపించాలి. సందర్భం... సమయం... చెబితే చాలు... తగిన సంగీతంతో ఆన్‌లైన్‌లో క్లయింట్‌ ముందు ప్రత్యక్షమవుతారు. ఆలోచన బాగుంది కదూ!


Advertisement
Advertisement
Advertisement