డిగ్రీలో ‘లైఫ్‌ స్కిల్‌’ కోర్సులు

ABN , First Publish Date - 2020-07-14T08:12:00+05:30 IST

అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల(డిగ్రీ) స్వరూపం మారిపోనుంది. సాధారణ డిగ్రీ విద్యలో లైఫ్‌

డిగ్రీలో ‘లైఫ్‌ స్కిల్‌’ కోర్సులు

  • సీబీసీఎస్‌లో ఉన్నత విద్యామండలి కొత్త సిలబస్‌

అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల(డిగ్రీ) స్వరూపం మారిపోనుంది. సాధారణ డిగ్రీ విద్యలో లైఫ్‌ స్కిల్‌ కోర్సులను ప్రవేశ పెడుతూ రివైజ్డ్‌ సిలబస్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి సురేశ్‌ తెలిపారు.  ఫౌండేషన్‌ కోర్సుల స్థానంలో.. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంచేందుకు వీలుగా లైఫ్‌ స్కిల్‌ కోర్సులను రూపొందించారు. 2020-21 విద్యా సంవత్సరం నుంచే ఈ సిలబస్‌ అన్ని డిగ్రీ కాలేజీల్లో అమల్లోకి రానుంది. యూజీసీ సూచనల మేరకు 2015-16 సంవత్సరంలో సీబీసీఎస్‌ను ప్రవేశపెట్టారు. పేరుకు సీబీసీఎస్‌ అయినా క్రెడిట్‌ ట్రాన్స్‌ ఆఫ్‌ ఛాయిస్‌ను విద్యార్థులకు కల్పించలేదు. గత ఐదేళ్లలో సిలబస్‌లో ఎలాంటి మార్పులు చేయక పోవడం గమనార్హం. 


రివైజ్డ్‌ సిలబస్‌లో ముఖ్యాంశాలు..

  1. మొట్టమొదటి సారిగా ఔట్‌ కమ్‌ బేస్డ్‌ సిలబస్‌ రూపకల్పన
  2. ఫౌండేషన్‌ కోర్సుల స్థానంలో లైఫ్‌ స్కిల్‌ కోర్సుల ప్రవేశం
  3. వీటిని ఎంపిక చేసుకునే అవకాశం విద్యార్థులకే
  4. స్కిల్‌ డెవలప్‌మెంట్‌, స్కిల్‌ ఎన్‌హాన్స్‌మెంట్‌ కోర్సులు
  5. తొలి 4 సెమిస్టర్స్‌లో 4 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులు
  6. కోర్సుకు సంబంధించి 6 స్కిల్‌ ఎన్‌హాన్స్‌మెంట్‌  
  7. 10 నెలల నిర్భంధ అప్రెంటిస్‌షిప్‌/ఇంటెన్షిప్‌/ఆన్‌ద జాబ్‌ ట్రైనింగ్‌ 
  8. ఆన్‌లైన్‌ కోర్సులు, మాక్‌ కోర్సులు చేసే వారికి అదనపు క్రెడిట్లు 
  9. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌జీసీలో పాల్గొనే వారికి క్రెడిట్స్‌
  10. సమాజంతో అనుసంధానం చేస్తూ ‘కమ్యూనిటీ సర్వీస్‌ ప్రాజెక్టు’
  11. విద్యార్థులకు, కళాశాలలకు గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం
  12. నూతన సిలబస్‌తో నైపుణ్యాన్ని అభివృద్ధి, ఉద్యోగ అవకాశాల పెంపు
  13. పాఠ్యాంశాలతో పాటు ప్రాక్టికల్‌ ఎక్స్‌పీరియన్స్‌కు సిలబస్‌లో చోటు 

Updated Date - 2020-07-14T08:12:00+05:30 IST