రామాయణ ఉదాహరణ: తప్పుడు వ్యక్తుల సహవాసం, తప్పుడు ఆలోచన.. చివరికి ఫలితమిదే!

ABN , First Publish Date - 2022-06-30T13:22:45+05:30 IST

తప్పుడు వ్యక్తుల సాంగత్యం ఎక్కడికి దారి తీస్తుందో...

రామాయణ ఉదాహరణ: తప్పుడు వ్యక్తుల సహవాసం, తప్పుడు ఆలోచన.. చివరికి ఫలితమిదే!

తప్పుడు వ్యక్తుల సాంగత్యం ఎక్కడికి దారి తీస్తుందో  తెలిపే రామాయణంలోని ఒక ఘట్టం ఇది. రావణుడు సీతను అపహరించాడు. శ్రీరాముడు వానర సైన్యంతో లంక చేరుకున్నాడు. రామరావణ యుద్ధం మొదలైంది. శ్రీరాముడు, లక్ష్మణుడు తదితరులు రావణుని సమూహంలో నిలిచిన యోధులను చంపుతున్నారు. ఆ సమయంలో రావణుడు తన సోదరుడు కుంభకర్ణుడిని నిద్ర నుండి లేపాడు. కుంభకర్ణుడు చాలా శక్తివంతుడు. రావణుడు కుంభకర్ణునికి విషయమంతా చెప్పాడు. అప్పుడు కుంభకర్ణుడు రావణునితో... ‘అన్నయ్యా... నువ్వు చేసిన పని తప్పు. శ్రీరాముడు సామాన్యుడు కాడు. సీతాదేవిని అపహరించడం ద్వారా మీరు లంకను ప్రమాదంలో పడేశారు’ అని అన్నాడు. 


కుంభకర్ణుడి మాటలు విన్న రావణుడు అతనిని ప్రలోభ పెట్టేందుకు అతనికి మాంసాన్ని, మద్యాన్ని అందించాడు. కుంభకర్ణుడు మాంసం తిన్నాడు. మద్యం తాగాడు. దీంతో కుంభకర్ణుడి బుద్ధి మరోవైపు మళ్లింది. కుంభకర్ణుడు మత్తులో ఉంటూ, శ్రీరాముడితో యుద్ధానికి అంగీకరించాడు. ఈ సమయంలో విభీషణుడు.. కుంభకర్ణునికి ఎదురయ్యాడు. అతనితో విభీషణుడు ‘నేను సోదరుడు రావణుని ఒప్పించడానికి ఎంతో ప్రయత్నించాను. దీంతో నన్ను తరిమి కొట్టాడు. నేను శ్రీరాముని ఆశ్రయించానని అన్నాడు. తరువాత కుంభకర్ణుడు శ్రీరాముడితో పోరాడి అతని చేతిలో హతమయ్యాడు. కుంభకర్ణునికి తప్పొప్పులు తెలిసినా తప్పుడు వ్యక్తుల సహవాసం, తప్పుడు ఆలోచనల కారణంగా జీవితాన్ని అంతం చేసుకున్నాడు. ఈ  ఘటన ద్వారా మనిషి ఎంతో నేర్చుకోవచ్చు.  తప్పులు చేసి అనంతరం పశ్చాత్తాప పడేకన్నా, తప్పులను సరిదిద్దుకోవడం ముఖ్యం. మనిషి తప్పుడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. 

Updated Date - 2022-06-30T13:22:45+05:30 IST