చాణ‌క్య‌నీతి: గత జన్మలోని కర్మల ఫలితమే వర్తమానం... ఇదే ఉదాహరణ!

ABN , First Publish Date - 2022-06-19T13:04:01+05:30 IST

చాణ‌క్య‌నీతి: గత జన్మలోని కర్మల ఫలితమే వర్తమానం... ఇదే ఉదాహరణ!

చాణ‌క్య‌నీతి: గత జన్మలోని కర్మల ఫలితమే వర్తమానం... ఇదే ఉదాహరణ!

వర్తమానంలో పొందుతున్న ఆనందం, దుఃఖం గత జన్మలో చేసిన కర్మల ఫలితమేనని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఒక వ్యక్తి గత జన్మలో చేసిన పనులను బట్టి అతని విధి ఉంటుదన్నాడు. అందుకే మనిషి తన జీవితాన్ని మంచి పనులకే అంకితం చేయాలి. ఆచార్య చాణక్యుడు కర్మ, జీవితం గురించి వివరించాడు. చాణక్య నీతిలోని రెండవ అధ్యాయంలోని రెండవ శ్లోకంలో ఆరు రకాల ఆనందాల గురించి తెలియజేశారు. మనిషికి లభించే సంతోషం గత జన్మలో చేసిన కర్మల ఆధారంగా మాత్రమే నిర్ణయమవుతుందని తెలిపారు. 


ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం ఒక వ్యక్తికి మంచి ఆహారం లభించిందంటే అది మంచి జీవితానికి సంకేతం. గత జన్మలో ఇతరుల కడుపు నింపిన అదృష్టవంతులకు మాత్రమే ఈ ఆనందం లభిస్తుంది. ఆచార్య చాణక్య మాట్లాడుతూ కేవలం మంచి ఆహారం లభించడమొక్కటే కాదు.. దానిని జీర్ణించుకునే శక్తి కూడా ఉండాలి. ఒక్కోసారి మంచి ఆహారం దొరికినా తినలేకపోతుంటారు. అనేక వ్యాధుల కారణంగా మనిషి మంచి ఆహారం తీసుకోలేడు. ఆహారం జీర్ణమయ్యే సామర్థ్యం ఉన్నవారు అదృష్టవంతులు. చాణక్య నీతి ప్రకారం మంచి గుణాలు కలిగిన జీవిత భాగస్వామిని పొందడం  గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. పూర్వ జన్మలోని పుణ్యకర్మ వలననే ఇది జరుగుతుంది. పూర్వ జన్మలో స్త్రీని అవమానించిన వారి వైవాహిక జీవితం ఎప్పుడూ సమస్యల్లోనే ఉంటుందని  ఆచార్య చాణక్య తెలిపారు. ఈ జన్మలో దానం చేయడం ద్వారానే తదపరి మంచి జన్మ లభిస్తుందని చాణక్య తెలిపారు. 

Updated Date - 2022-06-19T13:04:01+05:30 IST