వాల్మీకి జీవితం ఆదర్శనీయం

ABN , First Publish Date - 2021-10-21T06:24:09+05:30 IST

వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర ప్రతీ ఒక్కరికి ఆదర్శనీయమని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. బుధవారం సమీకృత కలెక్టరేట్‌లో వాల్మీకి జయంతిని వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

వాల్మీకి జీవితం ఆదర్శనీయం
నివాళి తెలుపుతున్న జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, అధికారులు

  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

- ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి 

సిరిసిల్ల, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): వాల్మీకి మహర్షి జీవిత  చరిత్ర ప్రతీ ఒక్కరికి ఆదర్శనీయమని  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. బుధవారం సమీకృత కలెక్టరేట్‌లో వాల్మీకి జయంతిని వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వాల్మీకి మహర్షి చిత్రపటానికి కలెక్టర్‌తోపాటు జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధి పొందిన రామాయణ మహాకావ్యాన్ని అందించిన మహానీయుడు వాల్మీకి మహర్షి అని కొనియాడారు.     కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్వో శ్రీనివాసరావు, జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమాధికారి మోహన్‌రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్‌ గడ్డం నర్సయ్య, చేనేత జౌళి శాఖ  ఏడీ సాగర్‌, జిల్లా ఉపాధి కల్పనాధికారి రాఘవేందర్‌, జిల్లా పరిశ్రమల జనరల్‌ మేనేజర్‌ ఉపేందర్‌రావు, వాల్మీకి బోయ జిల్లా అధ్యక్షుడు మీసరగండ్ల అనిల్‌కుమార్‌, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. 

సిరిసిల్ల క్రైం: రామాయణ గ్రంథాన్ని అందించిన మహనీయుడు వాల్మీకి అని ఎస్పీ రాహుల్‌ హెగ్డే కొనియాడారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ  ఆదర్శవంతమైన జీవితం గడపడంతో పాటు సమాజ శ్రేయస్సుకు అవసరమైన జీవన సూత్రాలను రామాయణం ద్వారా వాల్మీకి బోధించారన్నారు. 

Updated Date - 2021-10-21T06:24:09+05:30 IST