Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 10 Aug 2022 23:05:08 IST

మొక్కలతోనే జీవనాధారం

twitter-iconwatsapp-iconfb-icon
మొక్కలతోనే జీవనాధారం  మందమర్రి పోలీస్‌స్టేషన్‌లో మొక్కలు నాటుతున్న బెల్లంపల్లి ఏసీపీ మహేష్‌

 -  బెల్లంపల్లి ఏసీపీ మహేష్‌  

- పలు చోట్ల మొక్కలు నాటిన అధికారులు, నాయకులు 

మందమర్రి టౌన్‌, ఆగస్టు  10 : మొక్కలతోనే మానవుడికి జీవనాధారమని బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్‌ తెలిపారు. బుధవారం మందమర్రి పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. బెల్లంపల్లి డివిజ న్‌ పరిధిలోని అన్ని  పోలీస్‌స్టేషన్‌లలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు వాటి  రక్షణకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.కార్యక్రమంలో సీఐ ప్రమోద్‌కుమార్‌, ఎస్సై చంద్రకుమార్‌,  కాసిపేట, దేవాపూర్‌, రామకృష్ణాపూర్‌ ఎస్సైలు  పాల్గొన్నారు.  

ఏసీసీ:  వజ్రోత్సవాల వేడుకలలో భాగంగా బుధవారం వన మహోత్సవం కార్యక్రమం సందర్భంగా మంచిర్యాల ఇన్‌చార్జి డీసీపీ అఖిల్‌ మహజన్‌ పోలీసు సిబ్బంది, మున్సిపల్‌ కమిషనర్‌ బాలకృష్ణతో కలిసి మొక్కలు నాటారు.  కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ తిరుపతిరెడ్డి, సీఐ నారాయణ, ట్రాఫిక్‌ ఇన్స్‌పెక్టర్‌ నరేష్‌కుమార్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.   పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాలలో గ్రీన్‌ కోర్‌ పర్యావరణ క్లబ్‌ ఆధ్వర్యంలో వన మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో  గ్రీన్‌ కోర్‌ కోఆర్డినేటర్‌, రాష్ట్ర పర్యావరణ విద్య శిక్షకుడు గుండేటి యోగేశ్వర్‌,  ఇన్‌చార్జి హెచ్‌ఎం వేణుగోపాల్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ వంగ చక్రపాణి, శ్రీనివాస్‌వర్మ, ఉదయ్‌, రంగరాణి, నాగరాజు, రాజమౌళి, విద్యార్థులు పాల్గొన్నారు. 

నస్పూర్‌: నస్పూర్‌ మున్సిపాలిటీలోని 2వ వార్డులోని నర్సరీ వద్ద  స్వాత్రంత్య వజ్రోత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఫ్రీడం పార్కును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 750 మొక్కలతో లోగో రూపొందించారు. నర్సరీ వద్ద మున్సిపల్‌ చైర్మన్‌ ఈసంపెల్లి ప్రభాకర్‌ మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  కార్యక్రమంలో మార్కెట్‌ కమిటి చైర్మన్‌ పల్లె భూమేష్‌, మున్సిపల్‌ కమీషనర్‌ సీవీఎన్‌ రాజు, కౌన్సిలర్లు బండి పద్మ, బోయ మల్లయ్య, లక్ష్మి, మహేష్‌, సత్యనారాయణ, అన్నపూర్ణ, కోఆప్షన్‌ సభ్యులు నాసర్‌, ముత్తె రాజేశం, మున్సిపల్‌ మేనేజర్‌ రమేష్‌, ఆర్వో సతీష్‌, బిల్‌ కలెక్టర్లు శ్రీపతి సురేష్‌కుమార్‌, టీఎం నాగరాజు, మెప్మా ఆర్పీలు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.   నస్పూర్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలోమంచిర్యాల ఇన్‌చార్జి డీసీపీ అఖిల్‌ మహజన్‌ 75 మొక్కలు నాటారు.  కార్యక్రమంలో ఏసీపీ తిరుపతిరెడ్డి, సీఐ సంజీవ్‌, ఎస్సైలు శ్రీనివాస్‌, ఉదయ్‌కిరణ్‌, స్రవంతి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.  

హాజీపూర్‌: మండలంలని రాపెల్లి గ్రామంలో అధికారులు, ప్రజాప్రతినిధులు వన మహోత్సవం నిర్వహించి మొక్కలు నాటారు. ఎంపీపీ స్వర్ణలత, జెడ్పీ సీఈవో నరేందర్‌లు పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పల్లె భూమేష్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మొగిలి శ్రీనివాస్‌, యూత్‌ అద్యక్షులు దొమ్మటి బాపు, ఎంపీడీవో ఎంఏ హై, ఎంపీవో శ్రీనివాస్‌, ఏపీవో మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. 

లక్షెట్టిపేట రూరల్‌: మున్సిపాలిటీ  పరిధిలో బుధవారం వన మహోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబాఫూలే పాఠశాల ఆవరణంలో మున్సిపల్‌ చైర్మన్‌ నల్మాసు కాంతయ్య, వైస్‌ చైర్మన్‌ పొడేటి శ్రీనివాస్‌గౌడ్‌, ప్రజా ప్రతినిధులు,  పార్టీ నాయకులు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు.  పోలీస్‌స్టేషన్‌లో సీఐ కరీముల్లాఖాన్‌, ఎస్సై చంద్రశేఖర్‌ పోలీసు సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలలో జిల్లా గిరిజనాభివృద్ది అధికారిని నీలమ అధికారులతో కలిసి మొక్కలు నాటారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఆకుల వెంకటేష్‌, ప్రిన్సిపల్‌ గౌతమ్‌కుమార్‌రెడ్డి, జైలర్‌ స్వామి, కౌన్సిలర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.  

మందమర్రి: క్యాతన్‌పల్లి మున్సిపల్‌ సిబ్బంది నర్సరీ యందు 75 ఆకారం వచ్చేలా 150 మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో చైర్‌పర్సన్‌ జంగం కళ, కమీషనర్‌ వెంకట్‌నారాయణ, వైస్‌ చైర్‌పర్సన్‌ విద్యాసాగర్‌ రెడ్డి, కౌన్సిలర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

భీమారం: పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో జైపూర్‌ ఏసీపీ నరేందర్‌, శ్రీరాంపూర్‌ సీఐ రాజు, భీమారం ఎస్‌ఐ సుధాకర్‌లు మొక్కలు నాటారు. అలాగే మండల కేంద్రంలోని బృహత్‌ పల్లె ప్రకృతి వనం సమీపంలో మంచిర్యాల డీఆర్‌డీవో శేషాద్రి , ఎంపీడీవో శ్రీనివాస్‌, జెడ్పీహెచ్‌ఎస్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు , సర్పంచు గద్దె రాంరెడ్డిలు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.  కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్‌ పర్తిరెడ్డి మహేశ్వర్‌,  మండల నాయకులు భుక్య లక్ష్మణ్‌, ఎఎస్‌ఐ శకుంతల, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో సర్పంచులు, నాయకులు, అధికారులు మొక్కలు నాటారు. 

జైపూర్‌: మండలంలోని ఇందారం, గంగిపెల్లి ఫ్రీడమ్‌ పార్కుల్లో ఎంపీడీవో సత్యనారాయణ, ఏపీవో బాలయ్య, సర్పంచు గడ్డం మంజుల ప్రసాద్‌, లింగారెడ్డిలు మొక్కలు నాటారు.  కార్యక్రమంలో ఎంపీటీసీ స్వర్ణలతసంతోష్‌యాదవ్‌, వార్డు సభ్యులు శ్రీధర్‌, షరీఫ్‌, అమీరుద్దీన్‌, పంచాయతీ కార్యదర్శులు సుమన్‌, శ్రావణ్‌, పంచాయతీ సిబ్బంది బషీర్‌,సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

మందమర్రిరూరల్‌: చిర్రకుంట,శంకర్‌పల్లి, సారంగపల్లి గ్రామాల్లో వన మహోత్సవం నిర్వహించారు. 75 అంకె ఆకారంలో మొక్కలు నాటారు. ఎంపీడీవో శశికల, ఏపీవో రజియాసుల్తానా, సర్పంచులు కొమురయ్య, సది, నాయకులు ఫిరోజ్‌, కార్యదర్శులు శిరీష, హిమబిందు, వీరేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

కోటపల్లి: మొక్కలు నాటి సంరక్షించాలని డీఆర్‌డీవో శేషాద్రి అన్నారు. వజ్రోత్సవాల సందర్భంగా బుధవారం కోటపల్లిలోని బృహత్‌ పల్లె ప్రకృతి వనంలో అధికారులు, నాయకులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. మరో వైపు ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రూరల్‌ సీఐ విద్యాసాగర్‌ , ఎస్‌ఐ వెంకట్‌లు విద్యార్థులతో కలిసి 75 మొక్కలు నాటారు. అలాగే అటవీ రేంజ్‌ కార్యాలయంలో రేంజర్‌ రవి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.  కార్యక్రమంలో ఎంపీపీ మంత్రి సురేఖ, తహసీల్దార్‌ శ్రీనివాస్‌దేశ్‌పాండే, ఎంపీడీవో భాస్కర్‌, చెన్నూరు రూరల్‌ సీఐ విద్యాసాగర్‌, పశువైద్యాధికారి పవన్‌కుమార్‌, ఎస్‌ఐ వెంకట్‌ , ఎంఈవో తిరుపతిరెడ్డి, ఎంపీవో అక్తర్‌, ఏపీఎం రాజన్న, సర్పంచ్‌ రాజక్క తదితరులు పాల్గొన్నారు. కోటపల్లిలో  అధికారులు, విద్యార్థులతో కలిసి ఫ్రీడమ్‌ పార్కును ఏర్పాటు చేశారు. 

చెన్నూరురూరల్‌: కిష్టంపేట డిగ్రీ కళాశాల, అర్బన్‌ పార్కు, శివలింగాపూర్‌ రైతు వేదికల వద్ద , ముత్తారావుపల్లి, నారాయణపూర్‌, లంబాడిపల్లి, దుగ్నేపల్లి తదితర గ్రామాల్లో బుధవారం వన మహోత్సవాన్ని నిర్వహించారు. 75 అంకెను రాసి దాని చుట్టూ 75 మొక్కలు నాటారు. జాతీయ జెండాలను పట్టుకుని వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో శేషాద్రి, మండల ప్రత్యేకాధికారి కృష్ణ, ఎంపీపీ మంత్రి బాపు, జెడ్పీటీసీ మోతె తిరుపతి, వైస్‌ ఎంపీపీ బాపురెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ చల్ల రాంరెడ్డి, సర్పంచులు , ఎంపీటీసీలు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. 

భీమిని: మొక్కలతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందని భీమిని ఎస్‌ఐ వెంకటేష్‌, జెడ్పీటీసీ గంగక్కలు పేర్కొన్నారు. 75 సంవత్సరాల స్వతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం భీమిని పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటారు.  

తాండూర్‌: మండలంలోని మాదారం పంచాయతీలో బుధవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్లె ప్రకృతి  వనంలో 75 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పూసాల ప్రణయ్‌కుమార్‌, జెడ్పీటీసీ సాలిగామ బానయ్య, సర్పంచు సాగరిక, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, ఏపీవో నందకుమార్‌, ఈసీ సత్యనారాయణ, కార్యదర్శి సౌందర్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

నెన్నెల: స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో నెన్నెల బీట్‌   గుండ్లసోమారంలో బుధవారం వనమహోత్సవం నిర్వహించారు.  కార్యక్రమంలో కుశ్నపల్లి రేంజీ అధికారి గోవింద్‌చంద్‌ సర్దార్‌,  ఎంపీపీ సంతోషం రమాప్రతాప్‌రెడ్డి, జడ్పీటీసీ సింగతి శ్యామలారాంచందర్‌, ఎంపీడీవో వరలక్ష్మి, ఎంపీవీఓ శ్రీనివాస్‌, ఏపీవో నరేష్‌, డిప్యూటీ ఎఫ్‌ఆర్‌వో లక్ష్మినారాయణ,  ఎఫ్‌వీవోలు రజని, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

కన్నెపల్లి: మండలంలోని గొల్లగట్టు, కన్నెపల్లి, లింగాల, కృష్ణపల్లిలో 75 అంకె నమూనాలో మొక్కలు నాటారు. కన్నెపల్లి కస్తూర్బా పాఠశాలలో అధికారులు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ రాంచందర్‌, ఎస్‌ఐ సురేష్‌, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. 

శ్రీరాంపూర్‌: శ్రీరాంపూర్‌పోలీస్‌స్టేషన్‌లో వన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రాజు, ఎస్సై టి గంగరాజగౌడ్‌,    హెడ్‌ కానిస్టేబుల్‌ సత్తయ్య, కానిస్టేబుల్‌లు గోపతి శ్రీనివాస్‌, వేల్పుల రవి పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటారు.  

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.