భూమి కోసం యువకుడిని ట్రాప్ చేసింది.. కలుద్దామని పిలిపించి ఘోరానికి పాల్పడింది.. ఆమెకు ఎలాంటి శిక్ష పడిందంటే..!

ABN , First Publish Date - 2022-02-02T22:38:33+05:30 IST

అతను పంజాబ్ కోర్టులో ఉద్యోగి.. తన సంపాదనతో స్వగ్రామంలో మూడెకరాల భూమి కొన్నాడు..

భూమి కోసం యువకుడిని ట్రాప్ చేసింది.. కలుద్దామని పిలిపించి ఘోరానికి పాల్పడింది.. ఆమెకు ఎలాంటి శిక్ష పడిందంటే..!

అతను పంజాబ్ కోర్టులో ఉద్యోగి.. తన సంపాదనతో స్వగ్రామంలో మూడెకరాల భూమి కొన్నాడు.. అయితే ఆ భూమి వివాదంలో ఉంది.. వివాదాన్ని కోర్టులో పరిష్కరించుకోవాల్సిన ప్రత్యర్థి కుట్రకు తెర లేపింది.. ఓ యువతిని నియమించుకుని అతడిని ట్రాప్ చేసింది.. కలుద్దామని పిలిపించి హత్య చేసింది.. చివరకు అసలు విషయం బయటపడడంతో కటకటాలపాలైంది.


హర్యానాలోని హిసార్‌ జిల్లా తిగ్రి గ్రామానికి చెందిన బూటా సింగ్ అనే వ్యక్తి గతంలో నవ్‌దీప్ సింగ్ అనే వ్యక్తి దగ్గర మూడెకరాల పొలం కొన్నాడు. అయితే ఆ భూమి వివాదంలో ఉంది. తనకు వాటా ఇవ్వకుండా పొలం అమ్మేశాడని నవ్‌దీప్ సోదరి శుక్‌పాల్ కౌర్ కోర్టులో కేసు వేసింది. అయితే తీర్పు వచ్చే వరకు ఆగకుండా బూటా సింగ్‌ను చంపెయ్యాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఓ యువతిని నియమించుకుని బూటా సింగ్‌ను ముగ్గులోకి దింపింది. ఆ యువతితో బూటా సింగ్ తరచుగా మాట్లాడుతుండేవాడు.


2019 జనవరి 15న కలుద్దామని బూటా సింగ్‌ను ఆ యువతి కోరింది. ఆ యువతి ఆహ్వానం మేరకు బూటా సింగ్ ఆమె చెప్పిన చోటుకు వెళ్లాడు. అక్కడ బూటా సింగ్‌ను శుక్‌పాల్ కౌర్ తుపాకీతో కాల్చి చంపేసింది. అనంతరం మృతదేహాన్ని కాలవలో పడేసింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. దర్యాఫ్తు ప్రారంభించి అసలు విషయాన్ని బయటపెట్టారు. శుక్‌పాల్‌ను, బూటాసింగ్‌ను ట్రాప్ చేసిన యువతిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ కేసును విచారించిన కోర్టు తాజాగా తుదితీర్పు వెలువరించింది. ఇద్దరికీ జీవిత ఖైదు విధించింది.

Updated Date - 2022-02-02T22:38:33+05:30 IST