రూ.500 కోట్ల నికర ఆస్తులుంటే లైసెన్స్‌

ABN , First Publish Date - 2020-08-05T06:43:50+05:30 IST

పెట్రో ఉత్పత్తుల రిటైల్‌ మార్కెట్లో పోటీ మరింత పెరగనుంది. దేశీయ ప్రైవేటు సంస్థలతో పాటు విదేశీ సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశించేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

రూ.500 కోట్ల నికర ఆస్తులుంటే లైసెన్స్‌

  • రిటైల్‌ పెట్రో రంగంలో పెరగనున్న పోటీ

ముంబై: పెట్రో ఉత్పత్తుల రిటైల్‌ మార్కెట్లో పోటీ మరింత పెరగనుంది. దేశీయ ప్రైవేటు సంస్థలతో పాటు విదేశీ సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశించేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకోసం పెట్టుబడి నిబంధనలను సడలించింది. రూ.500 కోట్ల నికర ఆస్తులున్న ఏ కంపెనీకైనా ఇక రిటైల్‌, బల్క్‌ వినియోగదారులకు పెట్రో ఉత్పత్తులు సరఫరా చేసేందుకు అవసరమైన లైసెన్సు మంజురు చేస్తారు. రూ.250 కోట్ల నికర ఆస్తులున్న సంస్థలు మాత్రం రిటైల్‌ లేదా బల్క్‌ వినియోగదారుల్లో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాలి.

 ఇప్పటివరకు చమురు, గ్యాస్‌ అన్వేషణ ఉత్పత్తి, రిఫైనరీలు, పైప్‌లైన్లు లేదా ఎల్‌ఎన్‌జీ టెర్మినల్స్‌ ఏర్పాటు కోసం కనీసం రూ.2,000 కోట్లు పెట్టుబడి పెట్టిన సంస్థలను మాత్రమే ఇందుకు అనుమతించేవారు. తాజా నిబంధనల సడలింపుతో రిటైల్‌ పెట్రో ఉత్పత్తుల మార్కెట్లో ప్రభుత్వ రంగ సంస్థలకు తీవ్ర పోటీ ఏర్పడనుంది. 


కోలుకునేందుకు ఇంకో తొమ్మిది నెలలు : ఐఓసీ

మరోవైపు కొవిడ్‌తో దెబ్బతిన్న పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలు ఇప్పట్లో సాధారణ స్థితికి చేరే సూచనలు కనిపించడం లేదు.. ఇందుకు ఎంత లేదన్నా ఇంకో ఆరు నుంచి తొమ్మిది నెలలు పడుతుందని ప్రభుత్వ రంగంలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) డైరెక్టర్‌ ఎస్‌కే గుప్తా చెప్పారు. 

Updated Date - 2020-08-05T06:43:50+05:30 IST