‘లైసెన్స్‌’ వెంకీ చేతిలో ఉందా?

టాలీవుడ్‌లో రీమేక్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ విక్టరీ వెంకటేశ్‌. దాదాపు 25కు పైగా రీమేక్‌ చిత్రాల్లో నటించారాయన. ఇటీవల ‘దృశ్యమ్‌ 2’ రీమేక్‌తో సక్సెస్‌ అందుకున్నారు. ఇప్పుడు మరో రీమేక్‌ చేయడానికి వెంకీ సిద్ధమయ్యారని తెలిసింది. మలయాళంలో హిట్‌ అయిన చిత్రం ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’. దీన్ని తెలుగులో రీమేక్‌ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. రామ్‌ చరణ్‌ ఈ సినిమా హక్కుల్ని దక్కించుకున్నారు. మొదట వెంకటేష్‌, రవితేజలు కలిసి నటిస్తారని ప్రచారం జరిగింది. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’ పట్టాలెక్కించడం లేట్‌ అయింది. ఇప్పుడు ఈ సినిమా రామ్‌ చరణ్‌ నుంచి గీతా ఆర్ట్స్‌ చేతికి వచ్చిందని సమాచారం. వెంకటేశ్‌తో ఈ సినిమాని తీయాలని గీతా ఆర్ట్స్‌ భావిస్తోందట. రవితేజ కోసం అనుకున్న పాత్రలో ఓ యువ హీరోను తీసుకుంటారని తెలిసింది. ప్రస్తుతం వెంకటేష్‌ ‘ఎఫ్‌ 3’తో పాటుగా ఓ వెబ్‌ సిరీస్‌తో బిజీగా ఉన్నారు. అవి ఓ దారికి వచ్చాక ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’పై దృష్టి పెడతారని తెలిసింది. 


Advertisement