ఎల్‌ఐసీని ప్రభుత్వరంగంలోనే కొనసాగించాలి

ABN , First Publish Date - 2021-02-27T04:56:54+05:30 IST

ఎల్‌ఐసీని ప్రభుత్వరంగంలోనే కొనసాగించాలని, సంస్థకు స్వయం నిర్ణయ స్వేచ్ఛ ఇవ్వాలని ఎల్‌ఐసీ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఎ.రఘునాథరెడ్డి అన్నారు.

ఎల్‌ఐసీని ప్రభుత్వరంగంలోనే కొనసాగించాలి
సజ్జలకు మెమొరాండం సమర్పిస్తున్న రఘునాథరెడ్డి

కడప (సెవెన్‌రోడ్స్‌), ఫిబ్రవరి 26 : ఎల్‌ఐసీని ప్రభుత్వరంగంలోనే కొనసాగించాలని, సంస్థకు స్వయం నిర్ణయ స్వేచ్ఛ ఇవ్వాలని ఎల్‌ఐసీ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఎ.రఘునాథరెడ్డి అన్నారు. ఈ అంశాలపై అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం (ఏఐఐఈఏ) ఇచ్చిన దేశ వ్యాప్త పిలుపు మేరకు శుక్రవారం ఎల్‌ఐసీ యూనియన్‌ బృందం వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి, కడప ఎంపీ వైఎస్‌ అవినా్‌షరెడ్డిలకు మెమొరాండం సమర్పించారు. అనంతరం రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఇటీవల బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ఎల్‌ఐసీఐపీఓ తీసుకువస్తామని, ఎఫ్‌డీఐ 49 శాతం నుంచి 74శాతానికి పెంచుతామని, జనరల్‌ ఇన్సురెన్స్‌ కంపెనీని ప్రైవేటీకరిస్తామని చేసిన ప్రకటనలపై వారికి వివరించారు. ఎల్‌ఐసీ పాలసీపై జీఎస్టీ ఉపసంహరించాలని, ఎల్‌ఐసీ ప్రీమియంలకు పూర్తి ప్రత్యేక ఐటీ రాయితీ ఇవ్వాలన్న డిమాండ్లను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సజ్జల, అవినా్‌షరెడ్డిలు సమాధానమిస్తూ గతంలో కూడా ఈ అంశాలను ఆర్థికశాఖ దృష్టికి తీసుకెళ్లామని, పార్లమెంటులో కూడా మిగతా సభ్యులతో కలిసి ప్రస్తావిస్తామని తెలిపార న్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్షుడు అవధానం శ్రీనివాస్‌, సంయుక్త కార్యదర్శి కేసీఎస్‌ రాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T04:56:54+05:30 IST