ముంబై : సుమారు మూడు రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయిన IPO తర్వాత LIC షేర్లు రేపు(మంగళవారం) స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఇష్యూ పరిమాణం కంటే దాదాపు మూడు రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపిఓ) తర్వాత ఎల్‌ఐసి... రేపు స్టాక్ ఎక్స్ఛేంజీలలో జాబితా కానుంది. ప్రభుత్వం LIC షేర్ల ఇష్యూ ధరను ఒక్కొక్కటి ₹949 గా నిర్ణయించింది, దీని ద్వారా ఖజానాకు దాదాపు రూ. 20,557 కోట్లు సమకూరనున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. కాగా... అంతకన్నా ఎక్కువ మొత్తంలోనే సమకూరుతుందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి