ఈక్విటీల్లో ఎల్‌ఐసీ భారీ అమ్మకాలు

ABN , First Publish Date - 2021-05-11T05:43:25+05:30 IST

బీమా రంగ దిగ్గజం ఎల్‌ఐసీ లాభాల స్వీకారం లక్ష్యంతో తన చేతిలో ఉన్న షేర్లను విక్రయించింది. మొత్తం 296 కంపెనీల్లో ఎల్‌ఐసీకి వాటాలున్నాయి...

ఈక్విటీల్లో ఎల్‌ఐసీ భారీ అమ్మకాలు

న్యూఢిల్లీ: బీమా రంగ దిగ్గజం ఎల్‌ఐసీ లాభాల స్వీకారం లక్ష్యంతో తన చేతిలో ఉన్న షేర్లను విక్రయించింది. మొత్తం 296 కంపెనీల్లో ఎల్‌ఐసీకి వాటాలున్నాయి. డిసెంబరులో ఎల్‌ఐసీ చేతిలోని ఈక్విటీ వాటాల పరిమాణం 3.70 శాతం కాగా మార్చి నాటికి చారిత్రక కనిష్ఠ స్థాయి 3.66 శాతానికి తగ్గింది. 2012 సంవత్సరంలో ఎల్‌ఐసీ చేతిలోని ఈక్విటీ వాటాల పరిమాణం చారిత్రక గరిష్ఠ స్థాయి 5 శాతాన్ని తాకింది. వాటాలు తగ్గినా వాటి విలువ మాత్రం మార్చి నాటికి 6.30 శాతం పెరిగి చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.7.24 కోట్లకు చేరినట్టు ప్రైమ్‌ డేటాబేస్‌ గణాంకాలు తెలుపుతున్నాయి. 

డెట్‌ ఎంఎ్‌ఫల నుంచి ఉపసంహరణలు: మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో డెట్‌ ఎంఎ్‌ఫల నుంచి రూ.84,202 కోట్లు ఇన్వెస్టర్లు ఉపసంహరించారు. ఈ ఉపసంహరణల్లో లిక్విడ్‌ ఎంఎ్‌ఫల వాటా 56 శాతం ఉంది.  అలాగే డెట్‌ ఎంఎ్‌ఫల నుంచి నిధులు వెలుపలికి పోయిన తొలి త్రైమాసికం ఇదేనని మార్నింగ్‌ స్టార్‌ నివేదికలో తెలిపింది. 


Updated Date - 2021-05-11T05:43:25+05:30 IST