ఎల్‌ఐసీలో వారానికి 5 రోజుల పని

ABN , First Publish Date - 2021-05-07T06:15:07+05:30 IST

జీవితబీమా రంగంలోని ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీ వారానికి 5 పనిదినాల్లోకి మారుతోంది. ఈ నెల 10వ తేదీ నుంచి ఇది అమలులోకి వస్తుంది...

ఎల్‌ఐసీలో వారానికి 5 రోజుల పని

ముంబై: జీవితబీమా రంగంలోని ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీ వారానికి 5 పనిదినాల్లోకి మారుతోంది. ఈ నెల 10వ తేదీ నుంచి ఇది అమలులోకి వస్తుంది. ఎల్‌ఐసీకి ప్రతి శనివారం సెలవు దినంగా ప్రకటిస్తూ ఏప్రిల్‌ 15న ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఈ మార్పు చేసినట్టు తెలిపింది. ఇక ఎల్‌ఐసీ కార్యాలయాలన్నీ సోమవారం నుంచి శుక్రవారం మధ్యలో 5 రోజులూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 వరకు పని చేస్తాయి.


Updated Date - 2021-05-07T06:15:07+05:30 IST