ఎల్ఐసీ హౌసింగ్ గృహ రుణాలు మరింత ప్రియం
ABN , First Publish Date - 2022-05-14T08:27:02+05:30 IST
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్.. గృహ రుణాలు మరింత ప్రియం కానున్నాయి. పరపతి స్కోరింగ్‌ను బట్టి ఈ రుణాలపై
ముంబై : ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్.. గృహ రుణాలు మరింత ప్రియం కానున్నాయి. పరపతి స్కోరింగ్‌ను బట్టి ఈ రుణాలపై వడ్డీ రేటును కంపెనీ 20 బేసిస్ పాయింట్ల నుంచి 40 బేసిస్ పాయింట్లు పెంచేసింది. వంద బేసిస్ పాయింట్లు ఒక శాతానికి సమానం. పెంచిన వడ్డీ రేట్లు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయని తెలిపింది. సిబిల్ వ్యక్తిగత పరపతి రేటింగ్ స్కోరు 700 పాయింట్లకు మించిన వారికి ఇచ్చే గృహ రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు 6.7 శాతం నుంచి 6.9 శాతానికి పెరుగుతుంది. అంతకంటే తక్కువ స్కోరు ఉన్న వారికి ఇచ్చిన గృహ రుణాలపై వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్లు పెరుగుతుంది. కొత్తగా ఇచ్చే గృహ రుణాలపై మాత్రం వడ్డీ రేటు 40 బేసిస్ పాయింట్లు పెరుగుతుందని ఎల్ఐసీ హౌసింగ్ తెలిపింది.