LIC ఆర్థిక ఫలితాల వెల్లడి... 30 న...

ABN , First Publish Date - 2022-05-24T22:10:16+05:30 IST

ప్రైవేటీకరణ దిశగా సాగుతున్న LIC(జీవిత బీమా సంస్థ) డైరెక్టర్ల బోర్డు సమావేశం ఈ నెల 30 న జరగనుంది. మంగళవారం నాటి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఎల్‌ఐసీ ఈ వివరాలను తెలిపింది.

LIC ఆర్థిక ఫలితాల వెల్లడి... 30 న...

ముంబై : ప్రైవేటీకరణ దిశగా సాగుతున్న LIC(జీవిత బీమా సంస్థ) డైరెక్టర్ల బోర్డు సమావేశం ఈ నెల 30 న జరగనుంది. మంగళవారం నాటి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఎల్‌ఐసీ ఈ వివరాలను తెలిపింది. ఈ(2022) ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించేందుకు ఎల్‌ఐసీ డైరెక్టర్ల బోర్డు సమావేశం 30 వ తేదీన జరగనుందని ఎల్‌ఐసీ  మంగళవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ నెల ప్రారంభంలో(మే 7 వ తేదీన మార్కెట్ లో లిస్టైన ఇన్సూరెన్స్ బెహెమోత్, మార్చి 31 తో ముగిసిన త్రైమాసికంతో పాటు సంవత్సరానికి సంబంధించి ఆడిట్ అయిన ఆర్థిక ఫలితాలను బోర్డు పరిగణనలోకి తీసుకోవడంతో ఆమోదిసప్తుందని వెల్లడించింది. డివిడెండ్ చెల్లింపు అంశాన్ని కూడా సమావేశంలో పరిశీలించనున్నట్లు ఎల్‌ఐసీ వెల్లడించింది. 

Updated Date - 2022-05-24T22:10:16+05:30 IST