ఎల్‌ఐసీ... ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు...

ABN , First Publish Date - 2021-03-08T21:05:00+05:30 IST

ఎల్‌ఐసీ(జీవిత బీమా సంస్థ)ని పబ్లిక్ ఇష్యూకు తెచ్చే లక్ష్యంతో ఉన్న కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుంది. సంస్థ ఆథరైజ్డ్ క్యాపిటల్‌ను రూ.25 వేల కోట్లకు పెంచాలని ప్రతిపాదించింది.

ఎల్‌ఐసీ... ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు...

న్యూఢిల్లీ : ఎల్‌ఐసీ(జీవిత బీమా సంస్థ)ని పబ్లిక్ ఇష్యూకు తెచ్చే లక్ష్యంతో ఉన్న కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుంది. సంస్థ ఆథరైజ్డ్ క్యాపిటల్‌ను రూ.25 వేల కోట్లకు పెంచాలని ప్రతిపాదించింది. దీంతో రూ.10 ముఖవిలువ ఉన్న 2,500 కోట్ల షేర్లను ఐపీఓలో ఉంచే వెసులుబాటు కలుగుతుంది. అయితే... నిబంధనల మేరకు మొత్తం ఒకేసారి ఇష్యూలో ఉంచాల్సిన అవసరముండబోదు. అవసరాన్ని బట్టి దశల వారీగా 2,500 కోట్ల షేర్లను విక్రయించే వెసులుబాటు కలుగుతుంది. దీనికి బోర్డ్ అనుమతి కూడా తప్పనిసరి కాదు. ప్రస్తుతం, 29 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లున్న ఎల్‌ఐసీ పెయిడప్ క్యాపిటల్ రూ. 100 కోట్లు ఉంది.


కాగా... 1956 లో రూ. 5 కోట్ల ప్రారంభ మూలధనంతో మొదలైన ఎల్‌ఐసీకి ప్రస్తుతం రూ. 31,96,214.81 కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయి. ఎల్‌ఐసీ చట్టం(1956) లో ప్రతిపాదించిన సవరణ ప్రకారం... ఎల్‌ఐసీ ఆథరైజ్డ్ క్యాపిటల్ వాటా మూలధనం రూ. 25 వేల కోట్లుగా ఉండనుంది. ఒక్కో ఈక్విటీ షేర్ ముఖవిలువ రూ.10 చొప్పున 2,500 కోట్ల షేర్లను విభజించే అవకాశముంది.


ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు...

తాజా బడ్జెట్‌లో ప్రతిపాదించిన సవరణల మేరకు లిస్టింగ్ నిర్వహణ బాధ్యతలను చూసుకునేలా స్వతంత్ర డైరెక్టర్లతో కూడిన ఓ బోర్డు ఏర్పాటు కానుంది. చట్టంలో మొత్తం 27 సవరణలను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-03-08T21:05:00+05:30 IST