కాలుష్యం కోరల నుంచి డేంజర్‌జోన్‌ గ్రామాలకు విముక్తి

ABN , First Publish Date - 2021-03-08T04:44:33+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ మంగంపేట శాఖలలో డేంజర్‌ జోన్‌గా పరిగణించిన కాపుపల్లె, దళితవాడ, అరుంధతీవాడలకు కాలుష్యం నుంచి విముక్తి కల్పించి సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని ఏపీఎండీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.జి.వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

కాలుష్యం కోరల నుంచి డేంజర్‌జోన్‌ గ్రామాలకు విముక్తి
ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డితో సమావేశమైన మంగంపేట గ్రామ సంరక్షణ కమిటీ సభ్యులు

పల్వరైజింగ్‌ మిల్లుల భవిష్యత్తుపై సీఎంకు నివేదిక 

పునరావాస సమస్యలపై ఏపీఎండీసీ యాజమాన్యం సానుకూల స్పందన 


ఓబులవారిపల్లె, మార్చి 7: ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ మంగంపేట శాఖలలో డేంజర్‌ జోన్‌గా పరిగణించిన కాపుపల్లె, దళితవాడ, అరుంధతీవాడలకు కాలుష్యం నుంచి విముక్తి కల్పించి సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని ఏపీఎండీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.జి.వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం మంగంపేట గ్రామ సంరక్షణ కమిటీ అధ్యక్షుడు తల్లెం వెంకటరమణారెడ్డి, కమిటీ సభ్యులు విజయవాడ ఏపీఎండీసీ ప్రధాన కార్యాలయంలో ఎండీని కలిశారు. ఈ సందర్భంగా ప్రధానంగా డేంజర్‌జోన్‌ గ్రామాల తరలింపు, పల్వరైజింగ్‌ మిల్లుల సమస్యల గురించి చర్చిం చారు. దీంతో పాటు 2021లో అగ్రహారం గ్రామం తరలింపు కోసం 6 నెలలు సమ యం ఇచ్చి గ్రామాన్ని వెంటనే తరలించాలని ఆదేశిస్తూ అధికారులు పరిహార చెక్కు ల పంపిణీ చేశారన్నారు. ఇంత వరకు నివాస స్థలాలు చూపించలేదని ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. అగ్రహారం గ్రామానికి ప్రస్తుత చట్టాల ప్రకారం పూర్తిస్థాయిలో పరిహా రం చెల్లించాలని కోరారు.  బెరైటీస్‌ ఖనిజంపై ఆధారపడి సుమారు 200 మిల్లులు ఏర్పడ్డాయని, సకాలంలో ఖనిజం అందజేయలేక, విదేశీ మార్కెట్‌లో ఏర్పడ్డ సంక్షోభ పర్యావసానంతో బెరైటీస్‌ ఆధారిత పరిశ్రమలు మూతపడ్డాయి. వాటికి మునుపటి రోజులు తీసుకొచ్చి పరిశ్రమలతో పాటు అందులో జీవనోపాధి పొందుతున్న కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని విన్నవించారు. గతంలో గ్రామాలను డేంజర్‌ జోన్‌గా తరలించినప్పుడు ఉద్యోగ అవకాశాల కల్పనలో కొందరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కుటుం బాలకు న్యాయం జరగలేదని, వారికి న్యాయం చేయాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎండీ వెంకటరెడ్డి, డేంజర్‌ జోన్‌లోని గ్రామాలను తరలించి కాలుష్యం నుంచి విముక్తి కల్పిస్తామని తెలిపారు. పల్వరైజింగ్‌ మిల్లుల వ్యవహారంపై కమిటీ ద్వారా అధ్యయనం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రికి నివేదిక సమ ర్పించామన్నారు. పునరావాసుల సమస్యలను తప్పక పరిష్కరిస్తామని హామీ ఇచ్చా రు.  కార్యక్రమంలో ఏపీఎండీసీ జీఎం కేధార్‌నాథరెడ్డి, కమిటీ సభ్యులు వాల్మీకి శ్రీనివాసులు, కొటారు మణి, కె.సుబ్రహ్మణ్యంరెడ్డి, భరత్‌రెడ్డి, పల్వరైజింగ్‌ మిల్లుల యజమానులు రామచంద్రారెడ్డి, సాంబశివారెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, సగినాల సుబ్ర హ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-08T04:44:33+05:30 IST