స్టార్టప్స్‌ కోసం ‘పరపతి’ హామీ పథకం

ABN , First Publish Date - 2020-09-14T06:04:05+05:30 IST

దేశంలో అంకుర సంస్థల (స్టార్ట్‌ప్స)ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలకు సిద్ధమవుతోంది. ఈ

స్టార్టప్స్‌ కోసం ‘పరపతి’ హామీ పథకం

న్యూఢిల్లీ: దేశంలో అంకుర సంస్థల (స్టార్ట్‌ప్స)ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలకు సిద్ధమవుతోంది. ఈ సంస్థల పరపతి, ఆర్థిక అవసరాలు తీర్చేందుకు త్వరలో రెండు ప్రత్యేక పథకాలు ప్రారంభించబోతోంది. ఇందులో ఒకటి ఆ సంస్థల పరపతి అవసరాలు తీర్చే ‘హామీ’ పథకమని పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య శాఖ (డీపీఐఐటీ) కార్యదర్శి గురుప్రసాద్‌ మొహాపాత్ర చెప్పారు.


రెండో పథకం ప్రాథమిక దశలో స్టార్ట్‌పల మూలధన (సీడ్‌ క్యాపిటల్‌)  అవసరాలు తీర్చే పథకమన్నారు. ప్రస్తుతం ఈ రెండు పథకాలు ఇంకా చర్చల దశలోనే  ఉన్నట్టు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి లభించిన వెంటనే ఈ రెండు పథకాలను కేంద్ర కేబినెట్‌ ఆమోదం కోసం పంపించాలని డీపీఐఐటీ భావిస్తోంది. పరపతి హామీ పథకాన్ని బ్యాంకుల ద్వారా అమలు చేయబోతున్నట్టు మొహాపాత్ర చెప్పారు. ఇది మూలధన పెట్టుబడి పథకమే తప్ప, వెంచర్‌ క్యాపిటల్‌ నిధి కాదన్నారు. 

Updated Date - 2020-09-14T06:04:05+05:30 IST