పాలకూర సలాడ్‌!

ABN , First Publish Date - 2021-04-03T05:37:27+05:30 IST

ఆరోగ్యకరమైన ఆహారం మాటకొస్తే పాలకూర ఒకటి. విటమిన్‌ ఎ, ఫొలేట్‌, మెగ్నీషియం, ఐరన్‌తో పాటు పలురకాల

పాలకూర సలాడ్‌!

ఆరోగ్యకరమైన ఆహారం మాటకొస్తే పాలకూర ఒకటి. విటమిన్‌ ఎ, ఫొలేట్‌, మెగ్నీషియం, ఐరన్‌తో పాటు పలురకాల పోషకాలున్న పాలకూరను పప్పులో ఎక్కువగా తింటాం. అయితే ఈసారి పాలకూరను సలాడ్‌గా ఆరగిద్దాం.  


కావలసినవి: పాలకూర ఒకకట్ట, యాపిల్‌ ఒకటి, నారింజ ఒకటి, జున్ను ముక్క, తరగిన ఉల్లిపాయలు - పావుకప్పు, బాదం పలుకులు -10-15, కొన్ని పుదీనా ఆకులు. 

డ్రెస్సింగ్‌ కోసం: రెండు టేబుల్‌ స్పూన్ల చొప్పున ఆలివ్‌ నూనె, తేనె, రెండు లవంగాలు, ఆవాలు, నల్లమిరియాల పొడి, ఉప్పు రుచికి తగినంత. 

తయారీ విధానం: ఒక గిన్నెలో డ్రెస్సింగ్‌ పదార్థాలను కలిపి పక్కన పెట్టాలి. మరొక గిన్నెలో పాలకూర, యాపిల్‌ ముక్కలు తీసుకొని సలాడ్‌ తయారు చేసుకోవాలి. డ్రెస్సింగ్‌ మిశ్రమం వేసి మిరియాల పొడి, ఉప్పు చల్లాలి. ఇప్పుడు సలాడ్‌ను ఒక పాత్రలో తీసుకొని బాదం, పుదీనా ఆకులు, ఆవాలు వేయాలి. 


Updated Date - 2021-04-03T05:37:27+05:30 IST