Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

రండి.. ఈ వర్షాకాలన్ని మరింత ‘రుచి’గా మారుద్దాం!

twitter-iconwatsapp-iconfb-icon
రండి.. ఈ వర్షాకాలన్ని మరింత రుచిగా మారుద్దాం!

ఇది కవిత్వపు సీజన్‌. ఆహ్లాదకరమైన వాతావరణం. పచ్చదనం పులుముకున్న పుడమి. నాట్య మయూరాల పులకింత. ఒకటనేమిటి ఔట్‌డోర్‌, ఇండోర్‌ అన్న తేడా ఏమీ ఉండదు. ప్రతి చోటా పరవశమే. క్యాంపింగ్‌, ట్రెక్కింగ్‌, హైకింగ్‌ లాంగ్‌ వాక్స్‌... వర్షాకాలంంలో ఆస్వాదించేందుకు ఎన్నో అవకాశాలు. ఈ వారాంతంలో మీరు ఇంటిలోనే ఉండిపోతే తెలంగాణా స్ట్రీట్‌ ఫుడ్‌ను ఆస్వాదించడం మాత్రమే కాదు అంతకు మించిన ఆనందమూ పొందవచ్చు. ఈ రుచులు సముద్రపు ఒడ్డున సేద తీరుతూ ఆస్వాదించిన రుచులు, వర్షపు నీటిలో తడుస్తూ మురిసిన మనసు... ఎన్నెన్నో జ్ఞాపకాలను వెలికితీస్తాయి.


ఇంటి వద్ద ఆ భావాలను పునః సృష్టించుకునేందుకు కాస్త సృజనాత్మకత, మరికాస్త అభిరుచి జోడించి వంటింటిలోకి ప్రయాణించడమే. ఈ సీజన్‌లో మీ అభిమాన పదార్థాలను వినియోగించుకుని చేసేందుకు అనువుగా ఉన్న కొన్ని సీక్రెట్‌ రిసిపీలను చూద్దాం.


ఆనియన్‌ పకోడి: ఈ డిష్‌ లేకుండా వర్షాకాలం పూర్తి కాదు. ఆనియన్‌ రింగ్స్‌ అనేది ఈ స్ట్రీట్‌ ఫుడ్‌కు రెస్టారెంట్‌ వెర్షన్‌. కాస్త శనగపిండి, కొంత బియ్యంపిండి, చిటికెడు ఉప్పు, చెంచాడు కారం, కొద్దిగా పసుపు, నచ్చితే వాము, ఇంకాస్త జీలకర్ర, ఉల్లిపామలు, నువ్వులు జోడించి నూనెలో వేయించడమే !


బొంగుచికెన్‌: వెదురు గడలో ఉడికించే చికెన్‌. సాధారణంగా వేడి బొగ్గులపై స్మోకీ ఫ్లేవర్‌ కోసం వండుతారు. ఇంటిలో  కూడా దీన్ని కుకింగ్‌ పాట్‌లో బొగ్గులు వేసి ట్రై చేయొచ్చు.


టమోటా బజ్జి: టమోటాతో ప్రయోగాలు చేయడంలో ఇదో వెరైటీ. టమోటాను రెండుగా చేయాలి.  లోపల తీసేయాలి. నెమ్మదిగా ఫ్రై చేసి తగిన పరిమాణంలో స్పైసెస్‌ జోడించి చేసే టమోటా బజ్జి, మీరు గతంలో కుటుంబంతో కలిసి రోడ్డు పక్క తిన్న బజ్జీని గుర్తు చేయకమానదు.


రైల్‌ పలారం: తెలంగాణాలో అత్యంత ప్రాచుర్యం పొందిన బ్రేక్‌ఫాస్ట్‌ డిష్‌. దీని తయారీ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఇవేనా? మసాలా బతన్‌, పునుగులు, చెగోడీలు లాంటివి ఈసీజన్‌లో మధుర స్మృతుల్లోకి తీసుకువెళ్తాయి. డిష్ ఏదైనా నూనెను వాడడంలో మాత్రం జాగ్రత్త వహించాలి. లేదంటే ఆ వంట బెడిసికొట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నూనెల విషయంలో కాస్తంత జాగ్రత్త పాటించాలి.


ఇదే విషయమై గోల్డ్‌ డ్రాప్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ మితేష్‌ లోహియా మాట్లాడుతూ.. వర్షాకాలంలో గాలిలో ఉండే తేమ కారణంగా ఆహారం త్వరగా పాడవుతుందని పేర్కొన్నారు. గోల్డ్‌డ్రాప్‌ లాంటి నూనెలను ప్రపంచశ్రేణి రిఫైండ్‌ సదుపాయాల వద్ద రిఫైండ్‌ చేయడం వల్ల ఆహారం మరింత ఎక్కువ కాలం తాజాగా ఉంటుందన్నారు. తమ ఇంటిలో ఈ వర్షాకాలంలో ప్రయోగాలు చేస్తూనే ఉంటామన్నారు. కొన్నిసార్లు గోంగూర, బచ్చలి కూర వంటివి పప్పుతో కలిపి వండితే, పాలకూర, పన్నీర్‌తో వేయించిన స్నాక్స్‌ కూడా  తయారుచేసుకోవచ్చని మితేష్ లోహియా పేర్కొన్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ప్రత్యేకంLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.