పారా అథ్లెట్లకు మద్దతు ఇద్దాం

ABN , First Publish Date - 2021-08-24T09:01:52+05:30 IST

పారా అథ్లెట్లను నిజమైన హీరోలుగా దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ అభివర్ణించాడు.

పారా అథ్లెట్లకు మద్దతు ఇద్దాం

ముంబై: పారా అథ్లెట్లను నిజమైన హీరోలుగా దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ అభివర్ణించాడు. టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొంటున్న వారికి దేశ ప్రజలంతా మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చాడు. ‘ఇప్పుడు పారా అథ్లెట్ల వంతు వచ్చింది. టోక్యో క్రీడల్లో పాల్గొంటున్న భారత ఆటగాళ్లకు దేశ ప్రజలంతా అండగా నిలవాల్సిన అవసరం ఉంది’ అని టెండూల్కర్‌ అన్నాడు. ‘ఈ పురుషులు, మహిళలు ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన అథ్లెట్లే కాదు.. అద్భుతమైన ప్రతిభావంతులు. వారు మన నిజ జీవిత హీరోలు’ అని సచిన్‌ ప్రశంసించాడు. 

Updated Date - 2021-08-24T09:01:52+05:30 IST