పొలంబడితో రైతుకు ఖర్చు తగ్గిద్దాం

ABN , First Publish Date - 2021-02-25T05:25:53+05:30 IST

వ్యవసాయ సాగులో పొలంబడి విధానం ద్వారా రైతులకు ఖర్చు తగ్గిద్దామని జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి నాగార్జున, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు అరుణ, మాధురి తెలిపారు.

పొలంబడితో రైతుకు ఖర్చు తగ్గిద్దాం
పొలంబడిపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్న వ్యవసాయాధికారి నాగార్జున

సంబేపల్లె, ఫిబ్రవరి24: వ్యవసాయ సాగులో పొలంబడి విధానం ద్వారా రైతులకు ఖర్చు తగ్గిద్దామని జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి నాగార్జున, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు అరుణ, మాధురి తెలిపారు. బుధవార ం డివిజన్‌లో నాలుగు మండలాల గ్రామ వ్యవసాయ సహాయకులు, ఉద్యాన సహాయకులు, సిరికల్చర్‌ అసిస్టెంట్లు, బహుళ ప్రయోజన విస్తరణ అధికారులకు పొలంబడిపైన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.  అనంతరం వెలుగు కార్యాలయం సమావేశంలో రాయచోటి వ్యవసాయశాఖ ఏడీ సావిత్రి, ఆర్‌బీసీ కేంద్రాలను వినియోగించుకోవాలని తెలియజేశారు. పంట నమోదు తప్పక చేపట్టాలన్నారు. ఆర్‌బీసీ కేంద్రాల ద్వారా ఎరువుల అమ్మకాలను పెంచాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏవో వెంకటమోహన్‌, సాంకేతిక వ్యవసాయ అధికారి గీత, వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-25T05:25:53+05:30 IST