మేకప్‌ తేలిగ్గా తీసేద్దాం!

ABN , First Publish Date - 2020-02-20T05:56:40+05:30 IST

స్కిన్‌కేర్‌లో మేకప్‌ తొలగించడం కూడా ముఖ్యమైనదే. ఫంక్షన్లకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చాక మేకప్‌ రిమూవర్‌ అందుకుంటారు

మేకప్‌ తేలిగ్గా తీసేద్దాం!

స్కిన్‌కేర్‌లో మేకప్‌ తొలగించడం కూడా ముఖ్యమైనదే. ఫంక్షన్లకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చాక మేకప్‌ రిమూవర్‌ అందుకుంటారు చాలామంది. అయితే సమయానికి మేకప్‌ రిమూవర్‌ అందుబాటులో లేకున్నా కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ఇంట్లో లభించే వాటితో సులువుగా మేకప్‌ తొలగించవచ్చు. అదెలాగంటారా...


కొబ్బరి లేదా ఆలివ్‌ నూనె: కళ్ల దగ్గరి మేకప్‌, లిక్విడ్‌ లిప్‌స్టిక్‌ అంత తొందరగా వదలదు. కాటన్‌ ప్యాడ్‌ మీద కొద్దిగా కొబ్బరి లేదా ఆలివ్‌ నూనె వేసి దాంతో నెమ్మదిగా కళ్లు, పెదవుల మీద రుద్దితే మేకప్‌ పోతుంది. 

పెట్రోలియం జెల్లీ: కళ్ల దగ్గర మేకప్‌ వదిలించేందుకు పెట్రోలియం జెల్లీ రాయాలి. దాంతో దీనిలో మేకప్‌ కరిగిపోతుంది. ఇది సురక్షితమైనది కూడా. 

మాయిశ్చరైజర్‌ క్రీమ్‌: ఇది చర్మానికి తేమను అందించడమేగాక మేకప్‌ రిమూవర్‌గానూ పనిచేస్తుంది. కాటన్‌ ప్యాడ్‌ మీద మాయిశ్చరైజర్‌ క్రీమ్‌ రాసి, దాంతో కళ్ల చుట్టూ రుద్దితే మేకప్‌ తొలగిపోతుంది. అయితే ఆయిల్‌, పెట్రోలియం జెల్లీతో మేకప్‌ తొలగించిన తరువాత నీళ్లతో ముఖం కడుక్కోవడం మరవద్దు.

Updated Date - 2020-02-20T05:56:40+05:30 IST