నీటి ఎద్దడిని ఎదుర్కొందాం

ABN , First Publish Date - 2021-10-23T05:45:53+05:30 IST

భూగర్భ జలాల వినియోగంలో శాస్ర్తీయ దృక్పథాన్ని అవలంబించడం ద్వారా జిల్లాలో నీటి ఎద్దడిని ఎదుర్కొందామని కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన.. సంబంధిత అధికారులకు సూచించారు.

నీటి ఎద్దడిని ఎదుర్కొందాం
మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన

అనంతపురం, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): భూగర్భ జలాల వినియోగంలో శాస్ర్తీయ దృక్పథాన్ని అవలంబించడం ద్వారా జిల్లాలో  నీటి ఎద్దడిని ఎదుర్కొందామని కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన.. సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స హాల్‌లో భూగర్భ జలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆక్విఫర్‌ మ్యాప్స్‌, మేనేజ్‌మెంట్‌ ప్లాన సమావేశానికి కలెక్టర్‌ అధ్యక్షత వహించారు. ఆమె మాట్లాడుతూ... భూగర్బజల బోర్డు శాస్త్రవేత్తల సూచనలు పాటించి, జిల్లాలో నమోదైన వర్షపాతంలో సాధ్యమైనంత ఎక్కువ నీటిని భూగర్భ జలాల రూపంలో ఒడిసిపట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామగ్రామాన భూగర్భ జల మట్టాన్ని పెంచే పనులు చేపట్టాలన్నారు. మండలాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై కేంద్ర భూగర్భ జల బోర్డు తయారు చేసిన ప్రణాళికలను అమలు చేసేందుకు క్షేత్రస్థాయి సిబ్బందికి అవసరమైన శిక్షణ, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. భూ గర్భ జలాల వినియోగంలో ఒత్తిడి ఎదుర్కొంటున్న మండలాలపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో జేసీ నిశాంతకుమార్‌, భూగర్భ జలశాఖ డీడీ తిప్పేస్వామి, కేంద్ర భూగర్భ జల బోర్డు శాస్త్రవేత్త రవికుమార్‌, పీఆర్‌ ఎస్‌ఈ భా గ్యరాజు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ వెంకటరమణ, హార్టికల్చర్‌ డీడీ పద్మలత, ఏపీఎంఐపీ పీడీ ఫిరోజ్‌ఖాన పాల్గొన్నారు.

Updated Date - 2021-10-23T05:45:53+05:30 IST