Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైఎస్‌ ఆలోచన విధానాలను కొనసాగిద్దాం

డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి


బాపట్ల: మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఆలోచనా విధానాలను కొనసాగిద్దామని డిప్యూటీస్పీకర్‌ కోన రఘుపతి అన్నారు.  వైఎస్‌ 12వ వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక వైసీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. వైఎస్‌ పటానికి పుష్పాంజలి ఘటించి అక్కడ జరిగిన సభలో ఆయన మాట్లాడారు. పేదల హృదయాలలో వైఎస్‌ నిత్యం జీవించే ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా 22వ వార్డు సంజయ్‌గాంధీకాలనీలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పట్టణ,మండల వైసీపీ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశరావు, కోకి రాఘవరెడ్డి, మార్కెట్‌యారు చైౖర్మన్‌ గవిని కృష్ణమూర్తి, సీనియర్‌ నాయకులు చేజర్ల నారాయణరెడ్డి, పిండిమర కృష్ణ, ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, ముప్పిరి రాజశేఖర్‌బాబు, ఇనగలూరి మాల్యాద్రి, జోగి రాజా, బూర్లె అనీల్‌కుమార్‌, జాలిరెడ్డి, మాజీ కౌన్సిలర్‌లు  గేరా యెషయ్య, కాగిత సుధీర్‌బాబు, ఆదిలక్ష్మీ, ఇందిర తదితరులు పాల్గొన్నారు. 


ఎస్టీ కుటుంబాలకు దుప్పట్ల పంపిణీ 

బాపట్ల: మండలంలోని కొండుభొట్లపాలెం గ్రామంలో నల్లమడ డ్రెయిన్‌ కట్టపై నివాసం ఉంటున్న ఎస్టీ కుటుంబాలకు గురువారం దుప్పట్లు పంపిణీ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా డిప్యూటీ స్పీకర్‌ కోన పిలుపుమేరకు గ్రామనాయకులు నామన చక్రపాణి పార్టీశ్రేణులతో కలిసి దుప్పట్లు అందజేశారు.కార్యక్రమంలో ఓకే నాయుడు, ఉమ్మారెడ్డి కృష్ణమూర్తి, మల్లెల పవన్‌, అద్దంకి వెంకటేశ్వరరావు, పి.వెంకటనారాయణ, మార్పు లక్ష్మణ,  తోనాల చంటి తదితరులు పాల్గొన్నారు. 


పిట్టలవానిపాలెం మండలంలో... 

పిట్టలవానిపాలెం: దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి 12వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని పిట్టలవానిపాలెం మండల వైసీపీ అధ్యక్షుడు షేక్‌ బాజి ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా 14 గ్రామ పంచాయతీలలోని ప్రధాన కూడళ్ళ వద్ద వైఎస్సార్‌ విగ్రహాలకు, వివిధ ప్రాంతాలలోని వైఎస్సార్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర, మండల, గ్రామస్థాయి వైసీపీ నాయకులు గ్రామపంచాయతీలలో వైఎస్సార్‌ చిత్రపటాలకి నివాళులు అర్పించారు. పార్టీనాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


కర్లపాలెం మండలంలో...

కర్లపాలెం: కర్లపాలెం మండలంలోని 20 పంచాయతీలలో వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతిని గురువారం నిర్వహించారు. ఏట్రవారిపాలెం పంచాయతీలో సర్పంచ్‌ చీరాల వెంకటలక్ష్మీ శ్రీనివాసరెడ్డి వైఎస్‌ భారీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైసీపీ మండల అధ్యక్షుడు దొంతిబోయిన సీతారామిరెడ్డి  పార్టీనాయకులు, కార్యకర్తలతో కలిసి కర్లపాలెం జగనన్న కాలనీ ముఖద్వారం వద్ద వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పిట్ల వేణుగోపాలరెడ్డి, తాండ్ర సాంబశివరావు, తాతపూడి మనోహార్‌, మరుప్రోలు శివారెడ్డి, కృష్ణారెడ్డి, మందపాటి పరమానందకుమార్‌, అమీర్‌బేగ్‌, జయభారత్‌రెడ్డి, పందరబోయిన శ్రీనివాసరావు, భానుప్రసాద్‌, పులుగు గోవిందమ్మ, మునిరెడ్డి, అక్కల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement