పూలే ఆశయాలను సాధిద్దాం

ABN , First Publish Date - 2020-11-29T05:16:38+05:30 IST

మహాత్మా జ్యోతిభా పూలే ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ పిలుపునిచ్చారు. పూలే వర్ధంతి పురస్కరించుకుని శనివారం కలెక్టరేట్‌ వద్ద ఉన్న పూలే విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.

పూలే ఆశయాలను సాధిద్దాం
పూలే విగ్రహం ముందు నివాళి అర్పిస్తున్న కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ 

కలెక్టరేట్‌ , నవంబరు 28: మహాత్మా జ్యోతిభా పూలే ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ పిలుపునిచ్చారు. పూలే వర్ధంతి పురస్కరించుకుని శనివారం కలెక్టరేట్‌ వద్ద ఉన్న పూలే విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ వెనుకబడిన తరగతులు ,అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు జ్యోతిభా పూలే అని అన్నారు. ఆయన విగ్రహం ఉన్న ప్రాంతాన్ని పూలే సర్కిల్‌గా నామకరణం చేశారు. పూలే విగ్రహం పక్కనే సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి బీసీ సంఘాలు ముందుకు వచ్చాయని, దీనికి ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కూడా సహకారం అందించనున్నారని చెప్పారు. కార్యక్రమంలో దాసరి కార్పొరేషన్‌ చైర్మన్‌ రంగుముద్ర రమాదేవి, జేసీలు జీసీ కిషోర్‌ కుమార్‌, జె.వెంకటరావు, డీఆర్‌వో గణపతిరావు, బీసీ సంక్షేమాధికారి నాగరాణి, డీపీవో సునీల్‌రాజ్‌ కుమార్‌, పశుసంవర్ధక శాఖ జేడీ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. 

నిర్వాసిత జాబితాలోకి సారిపల్లి

తారకరామ రిజర్వాయర్‌ పరిసర గ్రామమైన సారిపల్లిని కూడా నిర్వాసిత చట్టం పరిధిలోకి తీసుకు వచ్చేందుకు  పరిశీలిస్తామని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ అన్నారు. తారకరామ రిజర్వాయర్‌ భూ నిర్వాసితుల సమస్యలపై సమీక్షించేందుకు శనివారం తన చాంబర్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సారిపల్లి గ్రామాన్ని ఆర్‌అండ్‌ఆర్‌ పరిధిలోకి తీసుకునే విషయాన్ని పరిశీలిస్తామని, అక్కడ ప్రజలకు న్యాయం చేస్తామన్నారు. అక్కడ ఉన్న 1400 కుటుంబాలకు గతంలో చేసిన సర్వే ఆధారంగా ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామన్నారు. 


Updated Date - 2020-11-29T05:16:38+05:30 IST