రాక్షస ప్రభుత్వాన్ని సాగనంపుదాం

ABN , First Publish Date - 2022-05-21T04:48:31+05:30 IST

ఒకవైపు సంక్షేమం అంటూ మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి రాక్షస ప్రభుత్వాన్ని సాగనంపుదాం అని మాజీ ఎమ్మెల్యే , టీడీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, తెలుగుదేశంపార్టీ యువ నాయకులు దామచర్ల సత్య పిలుపునిచ్చారు. గంగమ్మ జాతర సందర్భంగా పాలేటిగంగ సన్నిధిలో గురువారం రాత్రి వెంగళాపురం టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్‌ ప్రభపై నుంచి వారు మాట్లాడారు.

రాక్షస ప్రభుత్వాన్ని సాగనంపుదాం
టీడీపీ ఏర్పాటు చేసిన విద్యుత్‌ ప్రభపై ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న ఉగ్ర

టీడీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి

పీసీపల్లి, మే20 :ఒకవైపు సంక్షేమం అంటూ మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి రాక్షస ప్రభుత్వాన్ని సాగనంపుదాం అని మాజీ ఎమ్మెల్యే , టీడీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, తెలుగుదేశంపార్టీ యువ నాయకులు దామచర్ల సత్య  పిలుపునిచ్చారు. గంగమ్మ జాతర సందర్భంగా పాలేటిగంగ సన్నిధిలో గురువారం రాత్రి వెంగళాపురం టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్‌ ప్రభపై నుంచి వారు మాట్లాడారు. ఎన్నికలకు ముందు పాదయత్రలో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రతి ఒక్కరినీ మోసం చేశారని వారు విమర్శించారు. నిత్యావసర సరుకులైన పప్పులు, ఉప్పులు, నూనె ధరలు పెంచడంతో పాటు విద్యుత్‌ , బస్సు చార్జీలు, గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని మోపిందని వారు దుయ్యబట్టారు.ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసీపీ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించి రాక్షస ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రజలను కోరారు.  ఈ సందర్భంగా కనిగిరి శాసనసభ్యుడు బుర్రా మధుసూదన్‌యాదవ్‌ కు ఉగ్ర నరసింహారెడ్డి 5 ప్రశ్నలను సంధించారు. 40వేల మెజారిటీతో ప్రజలు గెలిపించారని కనిగిరి కాటమరాజుగా చెప్పుకునే మీరు రైల్వే లైన్‌, వెలుగొండ ప్రాజెక్టు, ట్రిపుల్‌ఐటీ, ఇంటింటికి  కుళాయి, నిమ్‌ స్థాపన ఏమైందని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పాలేటిపల్లి రిజర్వాయర్‌ నిర్మాణం చేపడితే మీరు అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలైనా ఇప్పటివరకు కాలువలు ఎందుకు తీయించలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు, మండలపార్టీ అధ్యక్షుడు వేమూరి రామయ్య, వెంగళాయపల్లి సర్పంచ్‌ కరణం తిరుపతయ్య(బిలాయి), వడ్డెనపూడి మాలకొండయ్య, పువ్వాడి బ్రహ్మయ్య, తమ్మినేని శ్రీనివాసరెడ్డి, ఫిరోజ్‌, కొపల్లి సురేష్‌, వడ్డెంపూడి వెంకట్‌, గుదే నాగేశ్వరరావు, నాగోతు శ్రీనివాసులు, పువ్వాడి నాగరాజు, కొల్లా శ్రీరాములు, ప్రతాప్‌, శ్రీరాములు, నంబుల వెంకటేశ్వర్లు, బద్దిపూడి ఎబినేజర్‌, జోసెఫ్‌, వెంగళాపురం తెలుగుయువత సభ్యులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-21T04:48:31+05:30 IST